హైదరాబాద్ మెట్రో భవిష్యత్తు మీ చేతుల్లోనే.. కేంద్ర పెద్ద ల తో మాట్లాడండి
Actor ProfilePolitician

హైదరాబాద్ మెట్రో భవిష్యత్తు మీ చేతుల్లోనే.. కేంద్ర పెద్ద ల తో మాట్లాడండి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
హైదరాబాద్ మెట్రో భవిష్యత్తు మీ చేతుల్లోనే.. కేంద్ర పెద్ద ల తో మాట్లాడండి
Telugu Times24 Sept 2026
హైదరాబాద్ మెట్రో భవిష్యత్తు మీ చేతుల్లోనే.. కేంద్ర పెద్ద ల తో మాట్లాడండి

కిషన్‌రెడ్డి గారూ... మెట్రోపై వ్యక్తిగతంగా జోక్యం చేసుకోండి ఫేజ్-2కు వెంటనే ఆమోదం ఇవ్వాడానికి స‌హ‌క‌రించండి ఫేజ్-1ను తెలంగాణకు అప్పగించే ప్రక్రియ వేగవంతానికి కృషి చేయండి ఆలస్యమైతే వేల కోట్ల అదనపు భారం పడే ప్రమాదమని ఆందోళన హైదరాబాద్, జూలై 5: హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ విషయంలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి వ్యక్తిగతంగా ప్ర‌త్యేక‌ చొరవ తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి కోరారు. రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధికి అత్యంత కీలకమైన హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 ప్రాజెక్టు ఇకపై మరింత ఆలస్యం కాకుండా చూడాలని, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ, రైల్వే శాఖలతో స్వయంగా మాట్లాడి, పెండింగ్‌లో ఉన్న అంశాలను వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఇదే విష‌యంపై శ‌నివారం కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా లేఖ రాశారు. హైదరాబాద్ వేగంగా విస్తరిస్తున్న అంతర్జాతీయ నగరమని, పెరుగుతున్న జనాభా, ట్రాఫిక్ సమస్యలు, భవిష్యత్ రవాణా అవసరాలను దృష్టిలో పెట్టుకుంటే మెట్రో ఫేజ్-2 విస్తరణ అత్యవసరమని లేఖలో స్పష్టం చేశారు సీఎం రేవంత్. ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే పరిపాలనా, ఆర్థిక ఆమోదం ఇవ్వాలని కోరారు. అలాగే ప్రస్తుతం అమలులో ఉన్న మెట్రో ఫేజ్-1ను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించే ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ రెండు అంశాలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నందున కేంద్ర ప్రభుత్వం మ‌రింత‌ ఆలస్యం చేయకుండా వెంటనే ఆమోదించి, నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. మెట్రో ఫేజ్-2 ప్రాజెక్టు అమలుకు సంబంధించి కేంద్రంలోని వివిధ శాఖల మధ్య సమన్వయం అవసరమని లేఖ‌లో గుర్తు చేసిన‌ సీఎం రేవంత్‌రెడ్డి... ఈ విషయంలో కిషన్‌రెడ్డి స్వయంగా ముందుండి ప్ర‌త్యేక‌ చొరవ తీసుకోవాలని కోరారు. కేంద్ర పట్టణాభివృద్ధి, రైల్వే శాఖలతో నేరుగా చర్చించి, పెండింగ్‌లో ఉన్న ఫైళ్లను ముందుకు తీసుకెళ్లాలని, హైదరాబాద్ అభివృద్ధికి అవసరమైన ఈ ప్రాజెక్టును త్వరగా ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి