అక్కినేని అఖిల్, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘లెనిన్’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మొదటి రోజే
హైదరాబాద్ నా కర్మ భూమి.. చివరి సినిమా కూడా ఇక్కడే చేస్తా
సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే గ్లామర్ ఉన్నంత మాత్రాన సరిపోదు.. బాక్సాఫీస్ వద్ద విజయం కూడా వరిస్తేనే ఇక్కడ క్రేజ్ నిలబడుతుంది. బాలీవుడ్ నుంచి దిగుమతి అయిన అందాల భామ భాగ్యశ్రీ బోర్సే సైతం తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటి నుంచి ఇదే సత్యాన్ని ఎదుర్కొంది. రవితేజ సరసన ‘మిస్టర్ బచ్చన్’ లాంటి భారీ పరాజయంతో కెరీర్ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ, ఆ తర్వాత చేసిన సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద నిరాశపరచడంతో ఆమెపై ఇండస్ట్రీలో ‘ఐరన్ లెగ్’ అనే ముద్ర వేసే ప్రయత్నాలు జరిగాయి.. వరుస ఫ్లాపులు వస్తున్నా ఆమెకు అవకాశాలు తగ్గకపోయినప్పటికీ, మనసులో మాత్రం ఒక సాలిడ్ హిట్ కోసం ఆమె ఎంతో ఆరాటపడింది. ఎట్టకేలకు అఖిల్ అక్కినేని హీరోగా నటించిన ‘లెనిన్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ బ్లాక్‌బస్టర్‌గా నిలవడంతో ఈ భామ కళ్లల్లో ఆనంద బాష్పాలు కురిశాయి.* అయ్యగారి బాక్సాఫీస్ సునామీ.. పాత రికార్డులన్నీ బద్దలు కొడుతూ ‘లెనిన్’ రికార్డ్ ఓపెనింగ్స్వేదికపైనే కన్నీళ్లు‘లెనిన్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తూ, అఖిల్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలవడంతో చిత్ర యూనిట్ హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో గ్రాండ్‌గా సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. ఈ వేడుకలో మైక్ పట్టుకుని మాట్లాడేందుకు ముందుకు వచ్చిన భాగ్యశ్రీ బోర్సే, ఒక్కసారిగా తీవ్ర భావోద్వేగానికి లోనై స్టేజీపైనే కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి ఎదుర్కొన్న విమర్శలు, ‘లెనిన్’ సినిమా కోసం పడిన కష్టం, ముఖ్యంగా ఈ వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చిన కింగ్ నాగార్జున తన నటనపై కురిపించిన ప్రశంసలను గుర్తుచేసుకుంటూ ఆమె స్టేజీపైనే ఏడ్చేశారు. ఆమె కళ్లల్లో నీళ్లు రావడం చూసి అక్కడున్న వారు కూడా భావోద్వేగానికి గురయ్యారు.హైదరాబాద్ నా కర్మభూమికొద్దికొద్దిగా తెలుగులో మాట్లాడుతూ తన క్యూట్ స్పీచ్‌తో అభిమానులను కట్టిపడేసిన భాగ్యశ్రీ... ఈ సందర్భంగా భావోద్వేగానికి గురయ్యారు. "నా అభిమానులు నన్ను నిరంతరం ప్రోత్సహిస్తూనే ఉన్నారు. సోషల్ మీడియాలో వారు చూపిస్తున్న ప్రేమ