హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్.. నంబర్ ప్లేట్లతో జాగ్రత్త
Actor ProfileCelebrity

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్.. నంబర్ ప్లేట్లతో జాగ్రత్త

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్.. నంబర్ ప్లేట్లతో జాగ్రత్త, ఈ రూల్స్ పాటించండి.. లేకపోతే క్రిమినల్ కేసులు
Samayam Telugu24 Jan 2027
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్.. నంబర్ ప్లేట్లతో జాగ్రత్త, ఈ రూల్స్ పాటించండి.. లేకపోతే క్రిమినల్ కేసులు

హైదరాబాద్‌లో ట్రాఫిక్ పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాహనాల నకిలీ నంబర్ పేట్లపై ఉక్కుపాదం మోపుతున్నారు. నగరంలో ప్రత్యేకంగా స్పెషల్ డ్రైవ్స్ నిర్వహిస్తున్నారు.. నంబర్ ప్లేట్లను మార్చడం, స్పష్టంగా లేకపోవడం, నిబంధనలకు విరుద్ధంగా ప్లేట్లు ఉంటే చర్యలు తీసుకుంటున్నారు. నకిలీ నంబర్ ప్లేట్లకు సంబంధించి కేసులు నమోదు చేస్తున్నారు. వాహనదారులు రిజిస్ట్రేషన్ నంబర్ స్పష్టంగా కనిపించేలా, ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలకు తగిన విధంగా ఉండాలని పోలీస్ అధికారులు సూచిస్తున్నారు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నకిలీ, ట్యాంపరింగ్ చేసిన, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నంబర్ ప్లేట్లతో తిరుగుతున్న వాహనాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. వాహనాల అసలు వివరాలు దాచడం, ట్రాఫిక్ చలానాల నుంచి తప్పించుకోవడం, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే ఉద్దేశంతో నకిలీ నంబర్ ప్లేట్లను ఉపయోగిస్తున్న వారిపై మోటారు వాహనాల చట్టం, తీవ్రమైన క్రిమినల్ చట్టాల కింద కేసులు నమోదు చేస్తున్నారు పోలీసులు. ఈ స్పెషల్ డ్రైవ్‌లలో గత వారం వ్యవధిలోనే నకిలీ నంబర్ ప్లేట్లు ఉపయోగిస్తున్న వారిపై 6 క్రిమినల్ కేసులు నమోదు చేశారు.. ఆ వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ డి జోయల్ డేవిస్ తెలిపారు.వాహనాలకు ప్రభుత్వం ఆమోదించిన హై-సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు (HSRP) మాత్రమే అమర్చాలని పోలీసులు సూచించారు. నంబర్ ప్లేట్లపై డిజైన్లు మార్చడం, అంకెలు తీసివేయడం, తాత్కాలిక స్టిక్కర్లు వేయడం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. నకిలీ, ట్యాంపరింగ్ చేసిన నంబర్ ప్లేట్లను ఉపయోగిస్తే జీరో టాలరెన్స్ విధానాన్ని అమలు చేస్తామన్నారు జాయింట్ సీపీ జోయల్ డేవిస్. వాహనాలకు సంబంధించి నిబంధనలు ఉల్లంఘించే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. అలాగే వాహనాలను వెంటనే సీజ్ చేస్తామని హెచ్చరించారు. నగరంలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, రహదారి భద్రత లక్ష్యంగా ఈ ప్రత్యేక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయన్నారు. వాహనదారులందరూ నంబర్ ప్లేట్ల విషయంలో తప్పనిసరిగా నిబంధనలు పాటించాలన్నారు. వాహనదారులు నంబర్