
అథర్వా మురళి కథానాయకుడిగా ఆకాశ్ భాస్కరన్ దర్శకత్వం వహించిన ‘ఇదయం మురళీ’ చిత్రం తెలుగులో ‘హృదయం మురళీ’ పేరుతో రిలీజ్ చేశారు. ప్రీతి ముకుందన్, కయాదు లోహర్ కథానాయికలు. తమన్, ఎన్ ఎం నిహారిక ఇతర ముఖ్య పాత్రధారులు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ దీనిని తెలుగులో విడుదల చేసింది. మరి ఈ సినిమాకు ఎలాంటి స్పందన లభిస్తుందో చూద్దాం. సినిమా రివ్యూ: ‘హృదయం మురళీ’ ( Hridayam Murali review) గతంలో పలు అనువాద చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన నటుడు అథర్వా మురళి(Atharvaa Murali). తెలుగులో కూడా 'గద్దలకొండ గణేశ్' చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించి ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ తెలుగులో కనిపించింది లేదు. తాజాగా ‘ఇదయం మురళీ’ తమిళ డబ్బింగ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆకాశ్ భాస్కరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తెలుగులో ‘హృదయం మురళీ’ పేరుతో రిలీజ్ చేశారు. ప్రీతి ముకుందన్, కయాదు లోహర్ కథానాయికలు. తమన్, ఎన్ ఎం నిహారిక ఇతర ముఖ్య పాత్రధారులు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ దీనిని తెలుగులో విడుదల చేసింది. మరి ఈ సినిమాకు ఎలాంటి స్పందన లభిస్తుందో చూద్దాం. కథ: హృదయ (అథర్వ మురళి) చిన్నతనంలో తల్లిదండ్రులను కోల్పోవడంతో మేనమామ (నట్టి) సంరక్షణలో పెరుగుతాడు. అతనొక ఇంట్రావర్ట్. ఏదీ త్వరగా చెప్పలేడు. కాలేజ్ చదువుతున్న రోజుల్లో సమంత (ప్రీతి ముకుందన్)తో ప్రేమలో పడతాడు. ప్రేమను ఎక్స్ప్రెస్ చేయడం ఆలస్యం కావడంతో ఆమె దూరమవుతుంది. మరో స్టేజ్ లో ఫ్రెండ్ సచిన్ (తమన్) ప్రియురాలు లాడో (ఎన్ఎం నిహారిక) ఫ్రెండ్ అముద (కాయదు లోహర్)తో పరిచయం ఏర్పడుతుంది. మళ్లీ అదే స్టోరీ... ప్రేమలో పడటం.. చెప్పలేకపోవడం… ఆ అమ్మాయి కూడా వృత్తిరీత్యా వేరే చోటుకి వెళ్లిపోవడంతో దూరమవుతారు. ఇక లైఫ్లో సెటిల్ అవడానికి మావయ్యతో కలిసి తమ డ్రీమ్ ప్రాజక్ట్ అయిన న్యూస్ ఛానల్