హిట్ మెషీన్ అడివి శేష్ చేతుల మీదుగా అ’ ఫస్ట్ లుక్ విడుదల
Actor ProfileActor

హిట్ మెషీన్ అడివి శేష్ చేతుల మీదుగా అ’ ఫస్ట్ లుక్ విడుదల

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
హిట్ మెషీన్ అడివి శేష్ చేతుల మీదుగా అ’ ఫస్ట్ లుక్ విడుదల
Telugu Times28 Dec 2026
హిట్ మెషీన్ అడివి శేష్ చేతుల మీదుగా అ’ ఫస్ట్ లుక్ విడుదల

రాహుల్ విజయ్ ఇంటెన్స్ అవతార్‌తో ఆకట్టుకుంటున్న థ్రిల్లర్! ప్యాషనేట్ ప్రొడక్షన్ హౌస్‌లు స్టార్ బాక్స్ స్టోరీస్, రిప్పుల్ స్లైడ్ స్టూడియోస్ తొలిసారిగా ఓ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. రాహుల్ విజయ్, అర్చన అయ్యర్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని కనకరావు తొనంగి, అభిషేక్ , ప్రముఖ ఎడిటర్-డైరెక్టర్ గ్యారీ BH నిర్మిస్తున్నారు. సాయి బాలి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం త్వరలోనే గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మోస్ట్ అవైటెడ్ టైటిల్, ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేయడంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. ఈ చిత్రానికి ‘అ’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను హిట్ మెషీన్ అడివి శేష్ ఆవిష్కరించారు. టైటిల్‌ను ఇంట్రెస్టింగ్‌గా ప్రజెంట్ చేయడంతో విడుదలైన వెంటనే అందరి దృష్టిని ఆకర్షించింది. టైటిల్ చుట్టూ ‘అమ్మాయి, అదృశ్యం, అన్వేషణ’ అనే పదాలను పొందుపరిచారు. అమ్మాయిలు అదృశ్యం కావడం, ఆ తర్వాత జరిగే దర్యాప్తు చుట్టూ కథ తిరుగుతుందని ఈ పదాలు సూచిస్తున్నాయి. ఇక ‘అనుమానం, అసాంఘికం, అమానుషం’ వంటి పదాలు కథలో కనిపించేదానికంటే మరింత ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయనే క్యూరియాసిటీని పెంచుతున్నాయి. ఆలోచింపజేసే పదాలతో రూపొందించిన ఈ ఇంట్రెస్టింగ్ టైటిల్ డిజైన్ విడుదలకు ముందే సినిమాపై ఆసక్తిని పెంచింది. ఇక ఫస్ట్ లుక్ ఈ క్యూరియాసిటీని మరింత పెంచింది. రాహుల్ విజయ్ ఓ ప్రదేశంలో చేతిలో లాఠీ పట్టుకుని కూర్చుని కనిపిస్తున్నారు. ఆయన చుట్టూ నేలంతా రక్తపు మరకలతో కనిపిస్తోంది. ఈ ఇంటెన్స్ విజువల్‌కు బ్యాక్‌గ్రౌండ్‌లో చార్మినార్ కనిపించడం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. దీంతో ఈ థ్రిల్లర్ కథ హైదరాబాద్ నేపథ్యంగా సాగుతుందని అర్థమవుతోంది. రాహుల్ విజయ్ స్ట్రైకింగ్ లుక్, ఫస్ట్ లుక్‌లో కనిపిస్తున్న డార్క్ అండ్ సస్పెన్స్‌ఫుల్ వాతావరణం సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. అర్చన అయ్యర్ రాహుల్ విజయ్ సరసన కథానాయికగా నటిస్తున్నారు. సాయి బాలి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తుండగా