హాట్ పిక్స్ కోసం కాదు.. నిజమైన నన్ను చూడటానికే సబ్ స్క్రైబ్ అవ్వండి.. పాయల్ బోల్ట్ కండిషన్
Actor ProfileActor

హాట్ పిక్స్ కోసం కాదు.. నిజమైన నన్ను చూడటానికే సబ్ స్క్రైబ్ అవ్వండి.. పాయల్ బోల్ట్ కండిషన్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
హాట్ పిక్స్ కోసం కాదు.. నిజమైన నన్ను చూడటానికే సబ్ స్క్రైబ్ అవ్వండి.. పాయల్ బోల్ట్ కండిషన్
Zee Telugu15 Oct 2026
హాట్ పిక్స్ కోసం కాదు.. నిజమైన నన్ను చూడటానికే సబ్ స్క్రైబ్ అవ్వండి.. పాయల్ బోల్ట్ కండిషన్

Payal Rajput: టాలీవుడ్ నటి పాయల్ రాజ్‌పుత్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్ గురించి స్పష్టమైన ప్రకటన చేసింది. ఇటీవల ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ ఫీచర్‌ను ప్రారంభించడంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. ఈ సబ్‌స్క్రిప్షన్‌లో ఎలాంటి కంటెంట్ ఉంటుందో తెలుసుకోవాలని చాలా మంది ఆమెకు సందేశాలు పంపారు. కొందరు మాత్రం గ్లామరస్ లేదా బోల్డ్ ఫోటోలు ఉంటాయని భావించారు. ఈ నేపథ్యంలో పాయల్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా క్లారిటీ ఇచ్చింది. "నా సబ్‌స్క్రైబర్ ఛానెల్‌లో ఏమి షేర్ చేస్తానని చాలా మంది అడుగుతున్నారు. ఒక విషయం స్పష్టంగా చెబుతున్నాను. హాట్ ఫోటోలు లేదా ఎక్స్‌ప్లిసిట్ కంటెంట్ కోసం సబ్‌స్క్రైబ్ చేయాలనుకుంటే ఇది మీ కోసం కాదు. కానీ నా నిజమైన జీవితం, తెరవెనుక జరిగే విషయాలు, ఫిల్టర్ లేని నా వ్యక్తిత్వాన్ని చూడాలనుకుంటే మాత్రం మీకు స్వాగతం. నా హద్దులను గౌరవించినందుకు ధన్యవాదాలు" అని ఆమె పేర్కొంది. అంతేకాకుండా తన పోస్టుకు క్యాప్షన్‌గా "ఈ స్పేస్ పూర్తిగా నా నిజమైన జీవితాన్ని, సహజమైన క్షణాలను పంచుకోవడానికి మాత్రమే. అంతకంటే ఇంకేమీ కాదు" అని రాసింది. దీంతో తన సబ్‌స్క్రైబర్లకు ఎలాంటి కంటెంట్ అందించబోతుందో ముందుగానే స్పష్టత ఇచ్చింది. ఇటీవలి కాలంలో కొంతమంది నటీమణులు ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్ ద్వారా ప్రత్యేకమైన గ్లామరస్ కంటెంట్‌ను పంచుకుంటూ వార్తల్లో నిలిచారు. అలాంటి కంటెంట్ ద్వారా మంచి ఆదాయం కూడా వస్తోందని ప్రచారం జరిగింది. దీంతో పాయల్ కూడా అదే దారిలో వెళ్తుందని చాలామంది భావించారు. అయితే పాయల్ ఆ అంచనాలకు పూర్తిగా భిన్నంగా స్పందించింది. అభిమానులతో నిజమైన అనుబంధాన్ని పెంచుకోవడమే తన లక్ష్యమని చెప్పింది. తన వ్యక్తిగత అనుభవాలు, షూటింగ్ వెనుక జరిగే సరదా క్షణాలు, రోజువారీ జీవితంలోని చిన్న చిన్న విషయాలనే సబ్‌స్క్రైబర్లతో పంచుకుంటానని తెలిపింది. ఆర్‌ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న పాయల్ రాజ్‌పుత్, ఆ చిత్రంలో బోల్డ్ పాత్రతో మంచి