సముద్రంలో 8 మంది మత్స్యకారుల గల్లంతు సీఎం చంద్రబాబు సమీక్ష
Actor ProfilePolitician

సముద్రంలో 8 మంది మత్స్యకారుల గల్లంతు సీఎం చంద్రబాబు సమీక్ష

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
సముద్రంలో 8 మంది మత్స్యకారుల గల్లంతు సీఎం చంద్రబాబు సమీక్ష
HMTV7 Jan 2027
సముద్రంలో 8 మంది మత్స్యకారుల గల్లంతు సీఎం చంద్రబాబు సమీక్ష

Amaravati: సముద్రంలో 8 మంది మత్స్యకారుల గల్లంతు సీఎం చంద్రబాబు సమీక్ష! Amaravati: సముద్రంలో చేపల వేటకు వెళ్లి గల్లంతైన ఎనిమిది మంది మత్స్యకారుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరమయ్యాయి. బీ.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలంలోని ఓడలరేవు, దుమ్మలపేట, వాసలతిప్ప గ్రామాలకు చెందిన మత్స్యకారులు ప్రయాణిస్తున్న బోటు ఆగస్టు 3 నుంచి కనిపించకుండా పోవడంతో వారి కుటుంబాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీఎంఓ అధికారులతో సమీక్ష నిర్వహించి, మత్స్యకారుల సురక్షిత ఆచూకీ కోసం అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను వినియోగించాలని ఆదేశించారు. ఆగస్టు 3న ఉదయం 10 గంటల సమయంలో మత్స్యకారుల బోటు ఓడలరేవు జెట్టి నుంచి చేపల వేట కోసం సముద్రంలోకి బయలుదేరింది. బోటు సముద్రంలోకి వెళ్లిన తర్వాత ఉదయం 11 గంటల వరకు కుటుంబ సభ్యులతో ఫోన్ ద్వారా సంబంధాలు కొనసాగాయి. ఆ తర్వాత ఒక్కసారిగా వారి నుంచి ఎలాంటి సమాచారం అందకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. బోటులో వీఎచ్ఎఫ్‌ సెట్‌తో పాటు మత్స్యకారుల వద్ద మొబైల్ ఫోన్లు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. అదే రోజు సాయంత్రం 6 గంటల సమయంలో బోటు నిర్దేశిత చేపల వేట ప్రాంతానికి చేరుకుని ఉండవచ్చని అధికారులు అంచనా వేశారు. సాధారణంగా చేపల వేట ముగించుకుని ఆగస్టు 12 నాటికి బోటు తిరిగి రావాల్సి ఉంది. అయితే నిర్ణీత సమయం దాటినా బోటు తిరిగి రాకపోవడంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. మత్స్యకారుల ఆచూకీ కోసం ప్రత్యేక గాలింపు చర్యలు ప్రారంభించారు. గల్లంతైన బోటు కోసం కోస్ట్‌గార్డ్‌ నౌకలను రంగంలోకి దించారు. సముద్రంలో విస్తృతంగా గాలింపు చేపడుతున్నారు. మరోవైపు కాకినాడ, భైరవపాలెం, విశాఖపట్నం, పారాదీప్‌ ప్రాంతాలకు చెందిన మత్స్యకారుల బోట్లను కూడా అధికారులు అప్రమత్తం చేశారు. సముద్రంలో చేపల వేటకు వెళ్లే ఇతర బోట్ల నుంచి గల్లంతైన బోటుకు సంబంధించి ఏమైనా సమాచారం లభిస్తుందా