సమంత కొత్త అవతారం.. ఇక వంటింట్లోనూ సామ్ హవానే
Actor ProfileCelebrity

సమంత కొత్త అవతారం.. ఇక వంటింట్లోనూ సామ్ హవానే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
సమంత కొత్త అవతారం.. ఇక వంటింట్లోనూ సామ్ హవానే
Zee Telugu26 Dec 2026
సమంత కొత్త అవతారం.. ఇక వంటింట్లోనూ సామ్ హవానే

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది. Samantha:సమంత రుతుప్రభు మరో కొత్త జర్నీకి శ్రీకారం చుట్టింది. ఇటీవల మా ఇంటి బంగారం సినిమాతో ప్రేక్షకులను అలరించిన ఆమె.. ఇప్పుడు బుల్లితెరపైకి అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. సెలబ్రిటీ మాస్టర్‌చెఫ్‌ తమిళ్‌ రియాలిటీ కుకింగ్ షోకు సమంత హోస్ట్‌గా వ్యవహరించనుంది. ఈ విషయాన్ని సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ అధికారికంగా ప్రకటించడంతో పాటు, సమంతను పరిచయం చేస్తూ ప్రత్యేక ప్రోమోను విడుదల చేసింది. మా ఇంటి బంగారం లో వంట రాని కోడలిగా కనిపించిన సమంత.. ఇప్పుడు ఏకంగా వంటల పోటీ కార్యక్రమానికే హోస్ట్‌గా వ్యవహరించనుండటం ఆసక్తిని కలిగిస్తోంది. తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు సెలబ్రిటీలు ఈ కుకింగ్ షోలో పోటీదారులుగా పాల్గొననున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ కార్యక్రమం సోనీ, సోనీ లివ్‌ వేదికలపై ప్రసారం కానుంది. ఈ కొత్త షో గురించి సమంత మాట్లాడుతూ.. ఇప్పటివరకు తాను చేసిన కార్యక్రమాలకు ఇది పూర్తిగా భిన్నమైనదని తెలిపింది. భోజనం అందరినీ ఒక్కటి చేస్తుందని, ఎన్నో మధురమైన జ్ఞాపకాలను అందిస్తుందని చెప్పింది. కెమెరాల ముందు కనిపించే సెలబ్రిటీలకు భిన్నంగా కిచెన్‌లో వారి కొత్త కోణాలను చూడటం ఆసక్తికరంగా ఉంటుందని పేర్కొంది. తమిళ సినీ పరిశ్రమకు చెందిన సెలబ్రిటీలు కిచెన్‌లోకి అడుగుపెట్టి వివిధ సవాళ్లను ఎదుర్కోవడం, తప్పులు చేయడం, ఆశ్చర్యపోవడం, ఉత్సాహంగా పోటీపడటం చూడటానికి తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు సమంత చెప్పింది. ఎవరు బాగా వంట చేస్తారో ముందే చెప్పేస్తే అందులో మజా ఉండదని, షోలో జరిగే విషయాలను ప్రేక్షకులతో కలిసి ఆస్వాదించాలని ఉందని