సమాజం తిరస్కరించిన వారి జీవితాల
Actor ProfileActor

సమాజం తిరస్కరించిన వారి జీవితాల

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
సమాజం తిరస్కరించిన వారి జీవితాలపై సినిమా.. టైటిల్ ఇదే
Chitrajyothy25 Jan 2027
సమాజం తిరస్కరించిన వారి జీవితాలపై సినిమా.. టైటిల్ ఇదే

అణగారిన ప్రజల కష్టాలు, వారి జీవిత గాథలను చెప్పే చిత్రంగా ‘అమరం’ రూపొందించినట్టు ఆ చిత్ర దర్శకుడు తిరు అరుల్‌ కృష్ణన్ చెప్పారు. తాజాగా ఈ మూవీ ఆడియో వేడుక గ్రాండ్‌గా నిర్వహించారు. అణగారిన ప్రజల కష్టాలు, వారి జీవిత గాథలను చెప్పే చిత్రంగా ‘అమరం’ (Amaram) రూపొందించినట్టు ఆ చిత్ర దర్శకుడు తిరు అరుల్‌ కృష్ణన్ (Arul Krishnan) చెప్పారు. దివ్య నేత్ర ఫిలిమ్స్‌ పతాకంపై సీఆర్‌ రాజన్‌ నిర్మించిన ఈ చిత్రంలో తేజస్‌ రాజన్‌ హీరోగా నటించగా, ఐరా అగర్వాల్‌ హీరోయిన్‌. ఇతర పాత్రల్లో జార్జ్‌, సాయిదీనా, నాగినీడు, కల్కిరాజన్‌, హరీష్‌ పేరడి, వాసుదేవన్‌ మురళి తదితరులు నటించారు. కథ, స్ర్కీన్‌‌ప్లే, సంభాషణలు, దర్శకత్వం తిరు అరుల్‌ కృష్ణన్‌. సంగీతం మిక్కీ జే మేయర్‌. ఈ నెల 28వ తేదీ విడుదలకానున్న ఈ చిత్ర ఆడియో రిలీజ్‌ వేడుక తాజాగా చెన్నై నగరంలో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత సీఆర్‌ రాజన్‌ మాట్లాడుతూ.. ‘‘ప్రతి ఒక్కరూ సినిమా తీయాలని కోరుకుంటారు. కానీ, అనేక మంది కళాకారుల కృషి, అంకితభావం అవసరం. అది కొన్ని సినిమాల విషయంలో మాత్రమే సాధ్యమవుతుంది. ఆ కోణంలో చూస్తే మా సినిమాకు అన్ని పుష్కలంగా లభించాయి. అందుకే ఒక అద్భుతమైన మూవీగా నిలుస్తుందని నమ్మకంగా చెబుతున్నా’’ అన్నారు. హీరో తేజస్‌ రాజన్‌ మాట్లాడుతూ.. మా అందరి కృషి ఫలితంగా ఓ చిత్రం రూపుదిద్దుకుని మీ ముందుకు వస్తోంది. ఈ సినిమా ట్రైలర్‌ ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది. 330 మందికిపైగా నటీనటులు, సాంకేతిక నిపుణులు అంకితభావంతో ఈ చిత్రాన్ని పూర్తిచేశాం. దర్శకుడు అరుల్‌ కృష్ణన్‌ చాలా చక్కగా తెరకెక్కించారని పేర్కొన్నారు. దర్శకుడు అరుల్‌ కృష్ణన్‌ మాట్లాడుతూ.. ‘‘ఈ స్టోరీ సమాజం తిరస్కరించిన వారి జీవితాల గురించి మాట్లాడుతుంది. ఇలాంటి కథ సృష్టించడానికి చాలా ధైర్యం కావాలి. ఆ ధైర్యం నిర్మాతలో ఉండటం వల్లే ఈ సినిమా సకాలంలో