
పంజాబీ నటుడు దిల్‌జిత్ దోసాంజ్ ప్రధాన పాత్రలో నటించిన ‘సత్లుజ్’ చిత్రాన్ని జీ5 ఓటీటీ వేదిక నుంచి తొలగించారు. సినిమాలోని కొన్ని సన్నివేశాలను భారత్ వ్యతిరేక శక్తులు దుర్వినియోగం చేసే అవకాశం ఉందన్న ఆందోళనతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.ఈ చిత్రం తొలుత ‘పంజాబ్ 95’ పేరుతో రూపొందింది. థియేటర్లలో విడుదలకు అనుమతి రాకపోవడంతో ఇటీవల ‘సత్లుజ్’ పేరుతో జీ5లో విడుదల చేశారు. అయితే విడుదలైన మరుసటి రోజే చిత్రాన్ని తొలగించారు.సినిమాలోని కొన్ని భాగాలపై గతంలోనే అభ్యంతరాలు వ్యక్తమయ్యాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అవే అంశాలు దేశ వ్యతిరేక శక్తులకు ఉపయోగపడే ప్రమాదం ఉందని భావించినట్లు పేర్కొన్నాయి.ఈ చిత్రం పంజాబ్‌లో ఉగ్రవాదం తీవ్రంగా ఉన్న సమయంలోని పరిస్థితుల ఆధారంగా తీశారు. అప్పుడు ఎన్‌కౌంటర్లు, మానవ హక్కుల ఉల్లంఘనలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. వాటిని వెలుగులోకి తీసుకువచ్చిన సామాజిక కార్యకర్త జస్వంత్ సింగ్ ఖల్రా జీవితం ఆధారంగా సినిమాను తెరకెక్కించారు.చిత్రాన్ని తొలగించిన విషయాన్ని జీ5 అధికారికంగా ధ్రువీకరించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ సినిమా భారత్‌లో అందుబాటులో ఉండదని ప్రకటించింది. అయితే చిత్ర బృందానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేసింది.చట్టపరమైన అన్ని మార్గాలను అనుసరించి వీలైనంత త్వరగా సినిమాను మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తామని జీ5 వెల్లడించింది.ఇక దిల్‌జిత్ దోసాంజ్ ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించారు. ‘‘చీకటిని నేను సవాల్ చేస్తున్నాను’’ అంటూ పోస్ట్ చేశారు. తర్వాత లైవ్‌లో మాట్లాడుతూ, ఒకసారి ఇంటర్నెట్‌లోకి వచ్చినది పూర్తిగా తొలగించలేరని అన్నారు. ‘‘నన్ను ఎంత