
బాలీవుడ్‌లో తెరకెక్కిన ‘సత్లుజ్’ చిత్రం ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే! సెన్సార్ సమస్యల వల్ల ఈ చిత్రం నేరుగా ఓటీటీలో విడుదలైంది. అది కూడా రెండు రోజులే ఓటీటీ స్ట్రీమింగ్ అయింది. బాలీవుడ్‌లో తెరకెక్కిన ‘సత్లుజ్’ (Satluj Movie) చిత్రం ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే! సెన్సార్ సమస్యల వల్ల ఈ చిత్రం నేరుగా ఓటీటీలో (Ott)విడుదలైంది. అది కూడా రెండు రోజులే ఓటీటీ స్ట్రీమింగ్ అయింది. తదుపరి ఆ చిత్రాన్ని ఓటీటీ నుంచి తొలగించారు. దీనిపై పెద్ద చర్చే జరుగుతోంది. ఈ నేపథ్యంలో రామ్‌గోపాల్ వర్మ (RGV) ఈ చిత్రం గురించి స్పందించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన పోస్ట్ చేశారు. ‘సత్లుజ్ సినిమా చూశా. ఇది సినిమా కాదు. ఎన్నటికీ మానని బలమైన గాయం. మన చరిత్రలోని చీకటి అధ్యాయాన్ని గుర్తు చేస్తుంది. దిల్జీత్ దొసాంజే ఈ సినిమా నటన కోసం గుండెలు బాదేసుకోలేదు. ఆ పాత్రకు, మన:సాక్షికి అనుగుణంగా ఎంతో కూల్‌గా చేసుకుంటూ వెళ్లాడు. ఆ సమయంలో అతని ఆయుధం తుపాకీ కాదు.. అతని అంతరాత్మ మాత్రమే! అర్జున్ రామ్‌పాల్ నటన అదనపు బలాన్ని ఇచ్చింది. నేరాల్లో వ్యవస్థలు భాగమైన తీరును వాస్తవికతతో చూపించారు. దర్శకుడు హనీ త్రేహాన్ ఈ చిత్రాన్ని సంచలనాత్మకంగా కాకుండా ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా మలిచారు. తెరపై అధికార యంత్రాంగ ఫైళ్లు, దహన సంసంస్కారాల వివరాలు, కొన్ని సంభాషణలు ఈ కథలోని తీవ్రతను తెలియజేశాయి. స్వలాభం కన్నా.. నిజాన్ని చెప్పాలని చేసిన ప్రయత్నంతో ఇది మరింత బలంగా తెరపై ఆవిష్కృతమైంది. ప్రజాస్వామ్యం సొంత పౌరులనే ఎలా బలి తీసుకుంటుంది. సాక్ష్యాలు లేకుండా ఎలా తుడిచిపెడుతుందో ఇప్పుడున్న సినారియోలో సినిమాలో చూపించడం సాధారణ విషయం కాదు. ఈ సినిమా చుట్టూ ఏర్పడిన వివాదాలే అందుకు నిదర్శనం. ఈ విషయంలో చిత్ర బృందం తనవంతు బాధ్యతను చక్కగా పూర్తి