
ఎదులాపురం: సిమెంటు పరిశ్రమ పునరుద్ధరణ డిమాండ్‌తో సీసీఐ సాధన కమిటీ పట్టణంలోని ఆర్అండ్‌బీ అతిథి గృహం వద్ద ప్రారంభించిన రిలే నిరాహార దీక్షలు బుధవారం నాటికి 11వ రోజుకు చేరాయి. బుధవారం రణదీవే నగర్ కాలనీవాసులు దీక్షలను కొనసాగించారు. ఈ సందర్భంగా సీసీఐ సాధన కమిటీ కో కన్వీనర్ విజ్జగిరి నారాయణ మాట్లాడుతూ.. సిమెంట్ పరిశ్రమను పునఃప్రారంభించే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని ప్రకటించారు. గతంలో భాజపా నాయకులు ఇచ్చిన హామీ మేరకు పరిశ్రమ పునరుద్ధరణ కృషి చేస్తూ తమతో కలిసి రావాలని పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.250 కోట్ల చొప్పున మంజూరు చేస్తే సంస్థ బ్యాంకు లోన్ ద్వారా రూ.1,500 కోట్లు సమకూర్చుకోవడానికి సిద్ధంగా ఉందని కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి వెల్లడించారన్నారు. స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు సిమెంట్ పరిశ్రమ తిరిగి ప్రారంభం కాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో సీసీఐ సాధన కమిటీ ప్రతినిధులు లోకారి పోశెట్టి, అరుణ్ కుమార్, దాసరి రమేష్, రంగన్న తదితరులు పాల్గొన్నారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు