సోషల్ మీడియా ట్రోలింగ్ తో కన్నీళ్లు పెట్టుకున్న ఫరియా అబ్దుల్లా
Actor ProfileActor

సోషల్ మీడియా ట్రోలింగ్ తో కన్నీళ్లు పెట్టుకున్న ఫరియా అబ్దుల్లా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
సోషల్ మీడియా ట్రోలింగ్ తో కన్నీళ్లు పెట్టుకున్న ఫరియా అబ్దుల్లా
Zee Telugu26 Dec 2026
సోషల్ మీడియా ట్రోలింగ్ తో కన్నీళ్లు పెట్టుకున్న ఫరియా అబ్దుల్లా

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది. Faria Abdullah:ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన బోనాల వేడుకల్లో ఫరియా పాల్గొంది. సంప్రదాయ దుస్తుల్లో కనిపించిన ఆమె పండుగలో ఎంతో ఉత్సాహంగా పాల్గొంది. అక్కడ తనకు లభించిన ప్రేమ, ఆదరణ చూసి ఫరియా భావోద్వేగానికి గురైంది. అయితే బోనాల వేడుకల్లో ఆమె పాల్గొనడాన్ని కొందరు తప్పుబట్టారు. ఫరియా ముస్లిం కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన కారణంగా, హిందూ పండుగలో ఎందుకు పాల్గొన్నావంటూ కొందరు సోషల్ మీడియాలో ఆమెను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు, ఆమెపై వ్యక్తిగతంగా కూడా విమర్శలు చేస్తూ హేట్ మెసేజ్‌లు పంపినట్లు సమాచారం. తనను ‘ఇస్లాం ద్రోహి’ అంటూ కొందరు కామెంట్లు చేయడం ఫరియాను తీవ్రంగా బాధించింది. దీంతో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఫరియా ఒక ఎమోషనల్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ వీడియోలో మాట్లాడుతున్న సమయంలో ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. తన కుటుంబ నేపథ్యం గురించి కూడా వివరించింది. ఫరియా చెప్పిన వివరాల ప్రకారం, ఆమె తల్లి ముస్లిం కుటుంబంలో జన్మించి తర్వాత హిందూ మతాన్ని ఇష్టపడి స్వీకరించారు. ఆమె తండ్రి హిందూ కుటుంబంలో జన్మించి తర్వాత ఇస్లాం మతాన్ని స్వీకరించారు. తన తండ్రి ఇస్లాంలోని మంచి విషయాలను మాత్రమే తనకు నేర్పించారని ఫరియా తెలిపింది. తనకు ద్వేషించడం తెలియదని, ప్రేమించడం మాత్రమే తెలుసని ఫరియా చెప్పింది. తనపై విమర్శలు చేస్తున్న వారిని కూడా తాను ద్వేషించనని, వారు కూడా బాగుండాలని కోరుకుంటానని తెలిపింది. ప్రేమ, శాంతి, ఐక్యత కోసం తాను ఎప్పుడూ ప్రార్థిస్తానని ఫరియా