స్వదేశానికి మన దేవుళ్లు.. ఆస్ట్రేలియా నుంచి భారత్ కి 3 అరుదైన విగ్రహాలు
Actor ProfilePolitician

స్వదేశానికి మన దేవుళ్లు.. ఆస్ట్రేలియా నుంచి భారత్ కి 3 అరుదైన విగ్రహాలు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
స్వదేశానికి మన దేవుళ్లు.. ఆస్ట్రేలియా నుంచి భారత్ కి 3 అరుదైన విగ్రహాలు
Zee Telugu21 Oct 2026
స్వదేశానికి మన దేవుళ్లు.. ఆస్ట్రేలియా నుంచి భారత్ కి 3 అరుదైన విగ్రహాలు

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. Stolen Ancient Idols Returned News: దేశ సంస్కృతి, ఆధ్యాత్మిక వైభవానికి ప్రతిరూపాలైన పురాతన దేవాలయ విగ్రహాలు ఎట్టకేలకు స్వదేశానికి చేరనున్నాయి. గతంలో తమిళనాడులోని ప్రముఖ ఆలయాల నుంచి దొంగిలించిన.. విదేశాలకు అక్రమంగా తరలించి.. ఆరు పురాతన విగ్రహాలను తిరిగి తీసుకువచ్చేందుకు తమిళనాడుకు సంబంధించిన ప్రత్యేక పోలీసు బృందం (Idol Wing) తీవ్ర ప్రయత్నాలు చేసింది.. ఈ క్రమంలో మొదటి విడతగా ఆస్ట్రేలియాలో ఉన్న మూడు అత్యంత విలువైన విగ్రహాలను భారతదేశానికి అప్పగించేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం అధికారికంగా అంగీకరించింది.. ప్రధాని మోదీకి అప్పగించిన విగ్రహాలు.. ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అక్కడి ప్రభుత్వం ఈ మూడు పురాతన విగ్రహాలను అధికారికంగా అందించింది.. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక సహాయంతో ఈ విగ్రహాలను విమానంలో ఢిల్లీకి తరిలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఢిల్లీ నుంచి.. తమిళనాడుకు చెందిన పోలీసులు భద్రత నడుమ వీటిని రాష్ట్రానికి తీసుకువచ్చి.. అవి ఏ ఆలయాలకు సంబంధించినవో ఆయా పుణ్యక్షేత్రాలలో శాస్త్రోక్తంగా పునఃప్రతిష్ఠించనున్నారు. ఆస్ట్రేలియా నుంచి వస్తున్న మూడు విగ్రహాలు ఇవే.. భారతదేశానికి తిరిగి వస్తున్న మూడు విగ్రహాలలో ఒక్కోదానికి ఒక్కో విశిష్టమైన చరిత్ర ఉందని అధికారులు తెలుపుతున్నారు. ఇందులో త్రిశూల భద్రకాళి అమ్మవారి విగ్రహానికి చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్య ఉంది. ఈ అపురూపమైన విగ్రహం తమిళనాడులోని తిరువారూర్ జిల్లా, కడువన్గుడి గ్రామంలో వెలసిన సుప్రసిద్ధ కైలాసనాథర్ ఆలయం నుంచి దొంగిలించిన్నట్లు తెలుస్తోంది. ఇక శివుని వాహనమైన ఈ పవిత్ర నంది విగ్రహం