స్వామి శరణం.. ఈసారి రవితేజకు హిట్ ఖాయం
Actor ProfileActor

స్వామి శరణం.. ఈసారి రవితేజకు హిట్ ఖాయం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
స్వామి శరణం.. ఈసారి రవితేజకు హిట్ ఖాయం
Chitrajyothy11 Dec 2026
స్వామి శరణం.. ఈసారి రవితేజకు హిట్ ఖాయం

మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న మోస్ట్ అవేటెడ్ చిత్రం ఇరుముడి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటించగా.. బేబీ నక్షత్ర కీలక పాత్రలో నటించింది. మాస్ మహారాజా రవితేజ (Raviteja) కథానాయకుడిగా దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న మోస్ట్ అవేటెడ్ చిత్రం ఇరుముడి (Irumudi). మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటించగా.. బేబీ నక్షత్ర కీలక పాత్రలో నటించింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా ఆగస్టు 21 న రిలీజ్ కానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ తాజాగా ఇరుముడి ట్రైలర్ ని రిలీజ్ చేశారు. మొదటి నుంచి ఈ సినిమా మొత్తం అయ్యప్ప దర్శనం, ఇరుముడి గురించి ఉంటుందని వార్తాలు వచ్చాయి. కానీ, ట్రైలర్ చూశాక ఇది విభిన్న కథాంశంతో రూపొందిన ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా అని తెలుస్తోంది. కథ విషయానికొస్తే.. త్రినాథ్ (రవితేజ) ఒక తాగుబోతు. ఇంట్లో భార్య ఎన్ని తిట్టినా మందు మాత్రం మానడు. అతనికి కూతురు మణికంఠ అంటే ప్రాణం. ఆమె కోసం ఏం చేయడానికి అయినా సిద్ధపడతాడు. నిత్యం తాగుతూ ఉండే త్రినాథ్ ప్రతి ఏటా 41 రోజులు అయ్యప్ప దీక్షలో మాత్రం ఎంతో నిష్టగా ఉంటాడు. ఇక వారు ఉండే ఊర్లో స్కూల్ లేకపోవడంతో పక్క ఊరు పంపించి తన కూతురును చదివిస్తుంటాడు. అయితే అక్కడ కొంతమంది అమ్మాయిలు హత్యకు గురవుతూ ఉంటారు. ఆ హత్యలు చేసేది ఎవరు. ? ఆ హత్యలకు త్రినాథ్ కి సంబంధం ఏంటి.. ? అయ్యప్ప దీక్షలో ఉన్న త్రినాథ్ ఆ హత్యలను ఆపగలిగాడా.. ? చివరికి అయ్యప్ప మహిమతో త్రినాథ్ మందు మానేశాడా.. ?