స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రజలకు చంద్రబాబు కీలక సూచనలు.. మన టార్గెట్ ఇదే
Actor ProfilePolitician

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రజలకు చంద్రబాబు కీలక సూచనలు.. మన టార్గెట్ ఇదే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రజలకు చంద్రబాబు కీలక సూచనలు.. మన టార్గెట్ ఇదే
10TV Telugu22 Dec 2026
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రజలకు చంద్రబాబు కీలక సూచనలు.. మన టార్గెట్ ఇదే

CM Chandrababu Naidu : ఆంధ్రప్రదేశ్ భవిష్యత్‌కు స్పష్టమైన లక్ష్యంతో ‘స్వర్ణాంధ్ర 2047’ విజన్‌ను రూపొందించామని చంద్రబాబు తెలిపారు. “హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఏపీ” లక్ష్యంగా 10 సూత్రాలను రూపొందించామని చెప్పారు. రాజధాని అమరావతిలోని రాయపూడి పరేడ్‌ మైదానంలో తొలిసారిగా నిర్వహించిన 80వ స్వాతంత్ర్య వేడుకలకు ముఖ్యమంత్రి హాజరై జాతీయజెండాను ఎగుర వేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రజలకు కీలక సూచనలు చేశారు. తెలుగు నేల కూడా స్వాతంత్ర్య సమరంలో కీలక పాత్ర పోషించిందని, అల్లూరి సీతారామరాజు పోరాటం, పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ జెండా తెలుగు ప్రజలకు గర్వకారణమని చంద్రబాబు అన్నారు. 80 ఏళ్ల క్రితం మన పెద్దలు స్వేచ్ఛా భారతదేశం కోసం కలలు కన్నారని.. వారు పోరాడి, త్యాగాలు చేసి ఆ స్వేచ్ఛను మనకు అందించారని, ఇప్పుడు దేశం కోసం పనిచేయాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. 2047 నాటికి భారత్‌ను, ఆంధ్రప్రదేశ్‌ను నంబర్‌-1గా నిలపాలనే సంకల్పంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. దేశం మనకు హక్కులు, గుర్తింపు, గౌరవం ఇచ్చిందని.. ఇప్పుడు దేశానికి మనం ఏం ఇవ్వగలమో ఆలోచించాలని చంద్రబాబు అన్నారు. “నా దేశం-నా బాధ్యత” అనే భావనతో ముందుకు సాగాలని సూచించారు. చేతిలో జాతీయ జెండాతో పాటు గుండెల్లో బలమైన అజెండా ఉండాలని చెప్పారు. వచ్చే 20 ఏళ్ల పాటు నిరంతరం పనిచేసి నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించేందుకు సంకల్పం తీసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ తమ రంగంలో బాధ్యతగా పనిచేయడమే ‘అనే నేను..’ సంకల్పానికి అర్థమన్నారు. విద్యార్థులు నైపుణ్యంతో ఆవిష్కరణలు చేయాలని, రైతులు ప్రకృతి సాగుతో ప్రజల ఆరోగ్యాన్ని, భూసారాన్ని కాపాడాలని సూచించారు. ఉద్యోగులు అంకితభావంతో పనిచేయాలని, మహిళలు అవకాశాలను అందిపుచ్చుకుని సాధికారత సాధించాలని అన్నారు. ప్రతి ఒక్కరి వ్యక్తిగత విజయం కూడా దేశ నిర్మాణంలో భాగమేనని చంద్రబాబు అన్నారు. కోట్లాది మంది భారతీయుల ఆలోచనలు ఒక్కటైతే అది దేశ సంకల్పంగా మారుతుందని చెప్పారు. వికసిత్ భారత్ 2047, స్వర్ణాంధ్ర