
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Minister Anam Ramanarayana Reddy Ill Health: ఆంధ్ర ప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఈ ఘటన తిరుపతి పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జరిగింది. జెండా ఆవిష్కరించిన తరువాత మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రసంగిస్తుండగా స్టేజీ పైన ఒక్కసారి కుప్పకూలిపోయారు. దీంతో ఉలిక్కిపడ్డ ఆనం భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. దీంతో పెద్ద గండం తప్పింది. దీంతో వారు అక్కడే ఉన్న వైద్యసిబ్బంది ఆనంకు ప్రాథమిక చికిత్స అందించారు. ఇక మంత్రి ఆనంను పరీక్షించిన వైద్యులు ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. గంటకు పైగా నిలబడి ప్రసంగించడంతో అస్వస్థత నెలకుందని చెప్పుకొచ్చారు. కొంత విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. దీంతో ఆనం తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆ రోజు ఆయన పాల్గొనాల్సిన కార్యక్రమాలు రద్దు చేయబడ్డాయి. డాక్టర్లు కొన్ని రోజులు రెస్ట్ తీసుకోమన్నారు. మొత్తంగా రాబోయే రోజుల్లో ఆనం పాల్గొనాల్సిన కార్యక్రమాలు రద్దు చేస్తారా లేదా కొనసాగుతాయా అనేది చూడాలి మరి. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి