స్వాతంత్య్ర దినోత్సవం రోజు పవన్ కళ్యాణ్ ఇచ్చే ట్రీట్ ఇదే
Actor ProfileActor

స్వాతంత్య్ర దినోత్సవం రోజు పవన్ కళ్యాణ్ ఇచ్చే ట్రీట్ ఇదే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
స్వాతంత్య్ర దినోత్సవం రోజు పవన్ కళ్యాణ్ ఇచ్చే ట్రీట్ ఇదే
Chitrajyothy17 Nov 2026
స్వాతంత్య్ర దినోత్సవం రోజు పవన్ కళ్యాణ్ ఇచ్చే ట్రీట్ ఇదే

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రియాంక అరుళ్ మోహన్ హీరోహీరోయిన్లుగా యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ సుజీత్ తెరకెక్కించిన మోస్ట్ పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఓజీ’. ఈ మూవీ టెలివిజన్ ప్రీమియర్‌కు డేట్ ఫిక్సయింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan), ప్రియాంక అరుళ్ మోహన్ (Priyanka Arul Mohan) హీరోహీరోయిన్లుగా యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ సుజీత్ తెరకెక్కించిన మోస్ట్ పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఓజీ’ (They Call Him OG). బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లతో ప్రభంజనం సృష్టించిన ఈ బ్లాక్‌బస్టర్ చిత్రం, థియేటర్ల తర్వాత ఓటీటీలోనూ సరికొత్త రికార్డులను నెలకొల్పింది. ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత ఈ క్రేజీ గ్యాంగ్‌స్టర్ డ్రామా బుల్లితెరపై గ్రాండ్ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌కు సిద్ధమైంది. పవన్ కళ్యాణ్ అభిమానులకు స్వాతంత్య్ర దినోత్సవ (Independence Day) కానుకగా ‘ఓజీ’ సందడి చేయబోతోంది. ఈ సినిమా శాటిలైట్ హక్కులను దక్కించుకున్న ఈటీవీ (ETV), ప్రీమియర్ డేట్‌ను అధికారికంగా లాక్ చేసింది. ఆగస్ట్ 15న సాయంత్రం 6 గంటలకు ఈటీవీలో ‘ఓజీ’ గ్రాండ్‌గా ప్రసారం కానుంది. ముంబై మాఫియా నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చూపించిన పవర్‌ఫుల్ ప్రెజెన్స్, మాస్ యాక్షన్ సీక్వెన్సెస్ బుల్లితెర వీక్షకులను, అభిమానులను విశేషంగా అలరించడం ఖాయంగా కనిపిస్తోంది. డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డివివి దానయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పాటలు సినిమాకు ప్రధాన అసెట్‌గా నిలిచాయి. ఇప్పటికే ఈ సినిమా స్మాల్ స్క్రీన్ ప్రోమోలు విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. మరోవైపు ఈ మైండ్ బ్లోయింగ్ హిట్ చిత్రానికి సీక్వెల్ ‘ఓజీ 2’ను కూడా త్వరలోనే సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు దర్శకుడు సుజిత్ సన్నాహాలు చేస్తుండటంతో పవన్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. చూద్దాం మరి.. బుల్లితెరపై గంభీర బీభత్సం ఎలా ఉంటుందో.. బర్త్‌‌డే స్పెషల్.. నటవారసుల్లో మహేష్