సెలవన్న కోకిలమ్మ
Actor ProfileActor

సెలవన్న కోకిలమ్మ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
సెలవన్న కోకిలమ్మ
Chitrajyothy29 Oct 2026
సెలవన్న కోకిలమ్మ

తెలుగునాట పుట్టి, చెన్నపట్టణంలో అడుగు పెట్టి- యావత్ భారతాన్నీ తన పాటతో కట్టిపడేశారు జానకి... దక్షిణాది అన్ని రాష్ట్రాలు జానకిని గానకోకిలగా తమ మదిలో నిలుపుకున్నాయి... పంచభూతాలనే పరవశింపచేసే గాత్రం ఎస్. జానకి సొంతం... జానకి గానమాధుర్యంలో యావద్భారతము ఆనందడోలికల్లో ఊగింది... అశేష అభిమానగణాలను శోకసముద్రంలో ముంచుతూ యస్.జానకి దివికేగారు... తెలుగునాట పుట్టి, చెన్నపట్టణంలో అడుగు పెట్టి- యావత్ భారతాన్నీ తన పాటతో కట్టిపడేశారు జానకి... దక్షిణాది అన్ని రాష్ట్రాలు జానకిని గానకోకిలగా తమ మదిలో నిలుపుకున్నాయి... ఈ నాటికీ జానకి పాటతో పరవశించి పోయేవారు ఎందరో ఉన్నారు.... తెలుగునేలను పులకింపచేసిన కోకిలమ్మలు ఎందరు ఉన్నా, వారిలో ఎస్.జానకి బాణీయే వేరు... స్వరాలకు అనుగుణంగా తన స్వరపేటికను మార్చుకోగల శక్తి జానకి సొంతం... బాల్యంలోనే ఆమె గళంలో జాలువారే ఏ పదమైనా రాగయుక్తంగా సాగి మనసుల్ని పులకింప చేస్తూ ఉండేది... అదే ఆమెను చెన్నపట్టణం చేర్చింది... అక్కడే జానకిలోని గాయని వెలుగు చూసింది... అభిమానగణాలను పోగేసుకుంది... జానకి ఆరంభంలోనే పలువురు ప్రఖ్యాత సంగీత దర్శకుల స్వరకల్పనలో పాటలు పాడే అవకాశం సంపాదించారు... ఆమె గళంలోని మాధుర్యం అప్పట్లోనే ఎందరో సంగీత పిపాసుల హృదయాలను పరవశింపచేసింది... పాట ఏదైనా సరే తన మధురగాత్రంతో సదరు గీతాన్ని అమృతతుల్యం చేయడం జానకమ్మలోని ప్రత్యేకత! ఎందరో కవిరాజులు ఆ రోజుల్లో తమదైన బాణీ పలికిస్తూ భావకవిత్వం చిలికించారు... అందుకు తగ్గట్టుగా వారి కలం పలికిన పదాలను తన గళంలో నింపుకొని అమృతం కురిపించారు జానకి... ఆ పదాలు నేటికీ మధురం పంచుతూనే సంగీతాభిమానులను ఆకర్షిస్తున్నాయి... తొలి రోజుల్లో జానకిని ఆ నాటి కొందరు స్టార్ హీరోయిన్స్ సెకండ్ గ్రేడ్ సింగర్ గా గుర్తించారు... అలాంటి వారికి తన గళంతోనే సమాధానం చెప్పిన మధురగాయని జానకి... తాను మాత్రం నాటి వర్ధమాన నాయికలకు సైతం పాడి, వారిని విజయపథంలో పయనింప చేశారు ఈ గానకోకిల... తన గాత్రమాధుర్యంతో స్వపరభేదం లేకుండా