సెలబ్రిటీ మాస్టర్ చెఫ్ తమిళ్ కు సమంత హోస్ట్.. టీవీతో పాటు ఓటీటీలోనూ సందడి
Actor ProfileActor

సెలబ్రిటీ మాస్టర్ చెఫ్ తమిళ్ కు సమంత హోస్ట్.. టీవీతో పాటు ఓటీటీలోనూ సందడి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
సెలబ్రిటీ మాస్టర్ చెఫ్ తమిళ్ కు సమంత హోస్ట్.. టీవీతో పాటు ఓటీటీలోనూ సందడి
NTV Telugu29 Dec 2026
సెలబ్రిటీ మాస్టర్ చెఫ్ తమిళ్ కు సమంత హోస్ట్.. టీవీతో పాటు ఓటీటీలోనూ సందడి

Samantha New Show: సమంత రూత్ ప్రభు మరోసారి కొత్త అవతారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సినిమాలు, వెబ్ సిరీస్‌లతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన ఆమె, ఇప్పుడు తొలిసారిగా ఒక భారీ కుకింగ్ రియాలిటీ షోకు వ్యాఖ్యాతగా బాధ్యతలు చేపట్టింది. ప్రపంచవ్యాప్తంగా విజయవంతమైన మాస్టర్‌చెఫ్ ఫార్మాట్‌కు తమిళ వెర్షన్‌గా వస్తున్న సెలబ్రిటీ మాస్టర్‌చెఫ్ తమిళ్ కార్యక్రమాన్ని సమంత హోస్ట్ చేయనుండటం అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచుతోంది. ఈ షోను ప్రముఖ నిర్మాణ సంస్థ బనిజయ్ ఆసియా రూపొందిస్తోంది. ఇందులో తమిళ సినీ, టెలివిజన్ రంగాలకు చెందిన ప్రముఖులు పోటీదారులుగా పాల్గొంటారు. వంటకాలు మాత్రమే కాకుండా, సెలబ్రిటీల వ్యక్తిత్వం, సరదా కబుర్లు, పోటీ స్ఫూర్తి కూడా ఈ కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఇటీవల విడుదలైన ఆఫీషియల్ ప్రోమోలో సమంత ఈ షోకు హోస్ట్‌గా కనిపించింది. అదే సమయంలో ఈ కొత్త ప్రయాణంపై ఆమె తన ఆనందాన్ని కూడా పంచుకుంది. ఇప్పటివరకు తాను చేసిన ప్రాజెక్టుల కంటే ఇది పూర్తిగా భిన్నమని, అందుకే ఈ అవకాశాన్ని వెంటనే అంగీకరించానని తెలిపింది. ఆహారం అనేది కేవలం వంటకం మాత్రమే కాదని, అది మనుషులను దగ్గర చేసే ఒక మధుర జ్ఞాపకమని సమంత చెప్పడం విశేషం. ముఖ్యంగా అభిమానులకు కనిపించని సెలబ్రిటీల మరో కోణాన్ని ఈ షో బయటపెడుతుందని ఆమె పేర్కొంది. వంటగదిలో వారు చేసే ప్రయోగాలు, తప్పులు, నవ్వులు, పోటీ ఉత్సాహం ప్రేక్షకులను అలరిస్తాయని చెప్పింది. పోటీదారుల పేర్లు ఇప్పుడే చెప్పలేనని, అదే ఈ షోలోని అసలు సర్‌ప్రైజ్ అని కూడా సరదాగా వ్యాఖ్యానించింది. ఈ కార్యక్రమం సోనీ విజా టీవీలో ప్రసారం కానుండగా, అదే సమయంలో సోనీలివ్ ఓటీటీ వేదికలో కూడా స్ట్రీమింగ్ కానుంది. దీంతో టెలివిజన్ ప్రేక్షకులతో పాటు డిజిటల్ ఆడియన్స్‌ను కూడా ఒకేసారి చేరుకునేలా మేకర్స్ ప్రణాళిక రూపొందించారు. అయితే ప్రీమియర్ తేదీని మాత్రం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఇటీవల సమంత