
కలబురగి, న్యూస్‌టుడే: బస్సు హెడ్‌లైట్లు పనిచేయకపోవడంతో సెల్‌ఫోన్ వెలుగుతో బస్సు నడిపిన ఘటన కర్ణాటకలో జరిగింది. శనివారం రాత్రి కలబురగి-చించోళి మధ్య నడుస్తున్న కేఎం 28ఈ1985 నంబరు ఆర్టీసీ బస్సు హెడ్‌లైట్లు పని చేయకపోవడంతో కండక్టర్ తన సెల్‌ఫోన్‌లో టార్చ్‌లైటును వేసి పట్టుకున్నారు. ఆ వెలుగులోనే డ్రైవరు బస్సును నడిపారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. సుమారు 84 కి.మీ. ప్రయాణించే బస్సుకు హెడ్‌లైట్లు లేకపోవడం ఘోరమని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. శిథిలావస్థకు చేరుకున్న బస్సుల స్థానంలో కొత్తవి కొనుగోలు చేసే సామర్థ్యాన్ని ప్రభుత్వం కోల్పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశాయి. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు