స్లీప్ ’ డేంజర్
Actor ProfileActor

స్లీప్ ’ డేంజర్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
స్లీప్ ’ డేంజర్
Sakshi24 Sept 2026
స్లీప్ ’ డేంజర్

భారత్‌లో ప్రతి ఐదుగురిలో ఒకరికి నిద్ర సమస్యలు నిద్రలేమితో బాధపడుతున్న దేశాల్లో మనకూ స్థానం ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, డిప్రెషన్, ఆందోళనలకు దారితీత 78% మంది డాక్టర్లను ఆశ్రయించేందుకు పరుగులు 140 కోట్ల జనాభాకు 500 కంటే తక్కువగా సరి్టఫైడ్‌ స్లీప్‌ స్పెషలిస్టులు ఆధునిక జీవనశైలి, శారీరక మార్పుల వల్ల భారతదేశం ప్రపంచంలోనే అత్యధికంగా నిద్రలేమితో బాధపడుతున్న దేశాల్లో ఒకటిగా మారుతోంది. మనదేశంలో ప్రతి ఐదుగురిలో ఒకరు నిద్రకు సంబంధించిన రుగ్మతలతో బాధపడుతున్నారని వైద్య అధ్యయనాలు, వివిధ సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. గంటల తరబడి నిద్ర పట్టకపోవడం...రాత్రిపూట పదే పదే మెలకువ రావడం...రాత్రి వేళల్లో కాళ్లు లాగడం వల్ల నిద్రకు భంగం కలగడం.. ఇలా అనేక రకాల నిద్ర సమస్యలు పట్టిపీడిస్తున్నాయి. అధ్యయనాలు, సర్వేల్లో ఏం తేలిందంటే ? తాజాగా ఐ–స్లీప్స్‌ (నిమ్‌హన్స్‌–ఐఐఐటీ హైదరాబాద్‌) పరిశోధనలో పక్షవాతానికి సంబంధం ఉన్నట్టు వెల్లడైంది. ఇస్కీమిక్‌ స్ట్రోక్‌ (మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం లేదా ఇతర అవయవాల నుంచి వచ్చిన కణాలు అడ్డుపడి ఆక్సిజన్‌ అందకపోవడం) వచి్చన రోగుల నిద్రను పరిశీలించగా, వారిలో 85% మంది శ్వాస రుగ్మతలతో బాధపడుతున్నట్లు తేలింది. వృద్ధులలో దాదాపు 37% మంది దీర్ఘకాలిక నిద్రలేమితో బాధపడుతున్నారు. షిఫ్ట్‌ వర్కర్లు, ఐటీ ప్రొఫెషనల్స్, నిరుద్యోగులలో (13.34%) బయోలాజికల్‌ క్లాక్‌ దెబ్బతినడం వల్ల నిద్ర రుగ్మతలు ఎక్కువగా నమోదవుతున్నాయి ⇒ ఎయిమ్స్‌ న్యూఢిల్లీ పరిశోధకుల సమగ్ర విశ్లేషణ ప్రకారం.. సుమారు 4.7 కోట్ల మందికి తీవ్రమైన స్లీప్‌ అప్నియా ఉంది. దీనివల్ల నిద్రలో ఆక్సిజన్‌ స్థాయిలు పడిపోయి ప్రాణాంతక పరిస్థితులు ఏర్పడుతున్నాయి ⇒ 2026 రెస్‌మెడ్‌ గ్లోబల్‌ స్లీప్‌ సర్వే ప్రకారం నిద్రలేమి సమస్య పురుషుల కంటే మహిళలపైనే ఎక్కువ శారీరక, మానసిక ప్రభావాన్ని చూపుతోంది. భారతీయులలో నిద్ర సరిగ్గా పట్టకపోవడానికి మానసిక ఒత్తిడి/ఆందోళన (39%), ఆఫీసు పనులు (37%), ఇంటి పనుల బాధ్యతలు (31%) ప్రధాన కారణాలు.78% మంది నిద్ర