
కోలీవుడ్ వివాదాస్పద నటుడు మన్సూర్ అలీ ఖాన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. సూర్య మూవీలో తనకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. కరుప్పు చిత్రంలో తాను ఎంతో కష్టపడి డ్యాన్స్ చేశానని తెలిపారు. అయితే ఎలాంటి కారణం చెప్పకుండానే తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సన్నివేశాలు యూట్యూబ్‌లో వస్తాయని నిర్మాత చెప్పారని.. కానీ అది కూడా జరగలేదని అన్నారు. సూర్య, కార్తీ పెద్ద స్టార్స్ అని.. వాళ్లు జీవించాలని కోరుకుంటానని అన్నారు. అయితే తమ లాంటి చిన్ననటులను కూడా బతకనివ్వాలని విజ్ఞప్తి చేశారు. తాను చాలా ఏళ్లుగా నటుడిగా, నిర్మాతగా చిత్రాలు చేస్తున్నానని తనకు న్యాయం జరగాలని మన్సూర్ అలీ ఖాన్ అన్నారు. ఆల్ పాస్ మూవీ ఈవెంట్‌కు హాజరైన ఆయన ఇలాంటి కామెంట్స్ చేశారు. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన కరుప్పులో తన సన్నివేశాలు తొలగించడంపై మన్సూర్ అలీ ఖాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ డ్యాన్స్ సీన్ కోసం తాను ఎంతో శ్రమించానని.. కానీ అది మూవీలో లేకపోవడం చాలా బాధగా ఉందన్నారు. ఆ పాటకు నేను విలన్లతో కలిసి డ్యాన్స్ చేశానని.. ప్రసాద్ ల్యాబ్స్‌లో ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ చేశానని వెల్లడించారు. ఈ సినిమాలో నా నటనను, కష్టాన్ని నా కొడుకులకు స్వయంగా చూపించా.. కానీ ఆ సన్నివేశాన్ని తొలగించారు. మీరు నటించిన సీన్ ఎందుకు తొలగించారని నా బిడ్డలు అడిగినప్పుడు నా చేతుల్లో ఏం లేదని చెప్పాను. కనీసం ఆ సన్నివేశం యూట్యూబ్‌లో కూడా లేకపోవడంతో మరింత బాధేసిందని అలీఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా.. ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించిన మూవీ కరుప్పు. ఈ చిత్రాన్ని వీరభద్రుడు పేరుతో తెలుగులో రిలీజ్ చేశారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. బిగ్ బాస్ ఫేమ్ జనని నాయకిగా నటించిన చిత్రం ఆల్ పాస్. నిరంగళ్ మూండ్రు, తరుణం చిత్రాల ఫేమ్