సిరియా రాజధానిలో భారీ పేలుళ్లు.. ఫ్రాన్స్ అధ్యక్షుడు త్రుటిలో తప్పిన ప్రమాదం
Actor ProfilePolitician

సిరియా రాజధానిలో భారీ పేలుళ్లు.. ఫ్రాన్స్ అధ్యక్షుడు త్రుటిలో తప్పిన ప్రమాదం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
సిరియా రాజధానిలో భారీ పేలుళ్లు.. ఫ్రాన్స్ అధ్యక్షుడు త్రుటిలో తప్పిన ప్రమాదం
Samayam Telugu4 Oct 2026
సిరియా రాజధానిలో భారీ పేలుళ్లు.. ఫ్రాన్స్ అధ్యక్షుడు త్రుటిలో తప్పిన ప్రమాదం

సిరియా పర్యటనలో ఉన్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్యూనుయేల్ మెక్రాన్‌కు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. సిరియా రాజధాని డమాస్కస్‌లో ఆయన విడిది చేసిన హోటల్ వద్ద రెండు వరుస పేలుళ్లు చోటుచేసుకున్నట్టు భద్రత వర్గాలు వెల్లడించాయి. అయితే, ఈ పేలుళ్ల శబ్దాలు అధ్యక్షుడికి వినబడలేదని ఫ్రెంచ్ దేశాధ్యక్షుడి అధికారిక నివాసం ఎలీసా ప్యాలెస్ స్పష్టం చేసింది. ఈ ఘటన జరిగిన కొద్దిసేపటికే ఆయన సిరియా అధ్యక్షుడు అహ్మద్ అల్-షరాతో సమావేశమయ్యారు. 2024లో షరా నేతృత్వంలోని రెబల్స్ బషర్ అల్-అసద్‌ను గద్దె దించిన తర్వాత, సిరియాలో పర్యటించిన ఐరోపా సమాఖ్య (EU)కు చెందిన మొదటి దేశాధినేత మెక్రాన్ కావడం గమనార్హం. అయితే ఈ తాజా పేలుళ్లు సిరియాలో ఉన్న తీవ్రమైన భద్రతా సవాళ్లను మరోసారి ఎత్తిచూపుతున్నాయి. రాయిటర్స్‌కు చెందిన ఒక ప్రత్యక్ష సాక్షి సమీపంలో పేలుళ్లు విన్నారని, మంటలు ఎగిసిపడటం చూశారని తెలిపారు. రహదారులను మూసివేసి, భద్రతా చర్యలు చేపట్టారని ఆ భద్రతా వర్గం పేర్కొంది. అధ్యక్షుడి కాన్వాయ్ నుంచి ఈ పేలుళ్ల శబ్దం వినిపించలేదని, మెక్రాన్‌తో పాటు ఉన్న పత్రికా బృందంలోని రాయిటర్స్ విలేకరి కూడా ఆయన కార్యక్రమాల సమయంలో పేలుడును వినలేదని లేదా ఎలాంటి గందరగోళాన్ని చూడలేదని ఎలీసా తెలిపింది.ఆ తర్వాత మెక్రాన్, షరా సిరియా అధ్యక్ష భవనంలో సమావేశమయ్యారని ప్రభుత్వ టెలివిజన్ నివేదించింది. 13 ఏళ్ల సుదీర్ఘ అంతర్యుద్ధంతో అతలాకుతలమైన దేశాన్ని పునర్నిర్మించే క్రమంలో... గతంలో అల్ ఖైదా కమాండర్‌గా ఉండి, ప్రస్తుతం పాశ్చాత్య, పశ్చిమాసియా దేశాలతో సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకున్న అహ్మద్ అల్-షరా నేతృత్వంలో సిరియా సాధిస్తున్న భౌగోళిక రాజకీయ మార్పులను మెక్రాన్ పర్యటన ప్రముఖంగా హైలైట్ చేసింది. గతంలో ఈ దేశాలు బషర్ అల్-అసద్ ప్రభుత్వానికి దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.అంతర్యుద్ధం సమయంలో ఇస్లామిక్ స్టేట్ (ISIS)తో సహా పలు తీవ్రవాద సమూహాలు సిరియాలో తమ స్థావరాలను ఏర్పరచుకున్నాయి. మెజారిటీ వర్గమైన సున్నీ ముస్లిం సమాజానికి చెందిన షరా