
తమిళ అగ్ర కథానాయకుడు సూర్య నటించిన తాజా చిత్రం ‘విశ్వనాథ్ & సన్స్’. ప్రతిభ గల దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మమితా బైజు కథానాయికగా నటించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. సహజమైన హాస్యం, సున్నితమైన భావోద్వేగాలతో హృదయాన్ని హత్తుకునే కుటుంబ కథా చిత్రంగా ఆగస్టు 14, 2026న థియేటర్లలో అడుగుపెట్టిన ‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. కేవలం నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించిన ఈ చిత్రం, అఖండ విజయం దిశగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో ముచ్చటించిన దర్శకుడు వెంకీ అట్లూరి, ‘విశ్వనాథ్ & సన్స్’ సాధించిన విజయం పట్ల సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా, ఈ సినిమా ప్రయాణం వెనుక ఉన్న పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాకి ఈ స్థాయి స్పందన రావడం ఎలా అనిపిస్తుంది? చాలా చాలా సంతోషంగా ఉంది. మేము ఊహించిన దానికంటే అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఈ కథ వినగానే సూర్య గారి రియాక్షన్ ఏంటి? కథ వినగానే సూర్య గారికి చాలా నచ్చేసింది. నిజానికి ఆయన ఒక ఫ్యామిలీ స్టోరీ కోసం చూస్తున్నారు. అదే విషయం నాకు చెప్పారు. ఈ కథ నా దగ్గర అప్పటికే సిద్ధంగా ఉండటంతో, ఆయనకు వినిపించాను. సూర్య గారికి కథ చాలా నచ్చింది. అయితే ఈ కథకు అనవసరమైన కామెడీ లేదా కమర్షియల్ అంశాలు జోడించకుండా.. నిజాయితీగా చెబుదామని అన్నారు. అందుకే క్లైమాక్స్ విషయంలో చాలా జాగ్రత్త తీసుకున్నాము. ముఖ్యంగా ఏ పాత్ర పడిపోకుండా జాగ్రత్త పడ్డాము. సినిమా విడుదలకు కొద్దిరోజుల ముందు సూర్య గారు చూశారు. తాను ఏదైతే నమ్మారో, అదే తెరమీద కనిపించడంతో ఆయన చాలా సంతోషపడ్డారు