సోమవారం పడిపోయిన అగధ కలెక్షన్లు.. 4వ రోజు ఎంఎస్ రాజు మూవీకి వచ్చింది ఇవే
Actor ProfileActor

సోమవారం పడిపోయిన అగధ కలెక్షన్లు.. 4వ రోజు ఎంఎస్ రాజు మూవీకి వచ్చింది ఇవే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
సోమవారం పడిపోయిన అగధ కలెక్షన్లు.. 4వ రోజు ఎంఎస్ రాజు మూవీకి వచ్చింది ఇవే
Asianet News Telugu7 Jan 2027
సోమవారం పడిపోయిన అగధ కలెక్షన్లు.. 4వ రోజు ఎంఎస్ రాజు మూవీకి వచ్చింది ఇవే

ఎంఎస్‌ రాజు దర్శకుడిగా తనని తాను నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన కమర్షియల్‌ గా హిట్‌ కొట్టాలని భావిస్తున్నారు. దర్శకుడిగా అంతకు ముందు చేసిన సినిమాలు పెద్దగా ఆడలేదు. దీంతో కమర్షియల్‌ హిట్‌ కోసం ఈజీ ఫార్ములా అయిన థ్రిల్లర్‌ ని ఎంచుకున్నారు. మిస్టరీ, హర్రర్‌, థ్రిల్లర్‌ అంశాలతో ఈ మూవీని నడిపించారు. అయితే హర్రర్‌ సినిమాల్లో చాలా వరకు కామెడీని జోడిస్తారు. కానీ ఈ సినిమాని సీరియస్‌గా నడిపించారు ఎంఎస్‌ రాజు. దీంతో ఇది ఆడియెన్స్ ని ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. ఎంఎస్‌ రాజు అగధ మూవీ బాక్సాఫీసు వద్ద స్ట్రగుల్ అవుతుంది. దీనికి ప్రారంభం నుంచి స్ట్రగుల్స్ తప్పడం లేదు. భారీ అంచనాలతో సినిమాని రిలీజ్‌ చేశారు. కానీ ఆ అంచనాలను అందుకోవడంలో వెనకబడింది సినిమా. అది కలెక్షన్లపై ప్రభావాన్ని చూపిస్తోంది. ఇక ఈ సినిమా నాలుగు రోజులు పూర్తి చేసుకుంది. ఫస్ట్ వీకెండ్‌లో డీసెంట్‌గానే కలెక్షన్లని రాబట్టింది. మరి సోమవారం వసూళ్లు ఎలా ఉన్నాయనేది చూస్తే, 30శాతానికిపైగానే డ్రాప్‌ కనిపిస్తుంది. 4వ రోజు `అగధ` చిత్రానికి ఇండియాలో రూ.15లక్షలు వచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇరవై లక్షలు రాబట్టింది. దీంతో నాల్గు రోజుల్లో ఈ సినిమాకి ఇండియాలో సుమారు రూ.1.38కోట్లు, ప్రపంచ వ్యాప్తంగా రూ.1.50కోట్లు వచ్చినట్టు ట్రేడ్‌ సైట్లు వెల్లడించాయి. అంటే దాదాపు రూ.80లక్షల షేర్‌ వచ్చింది. సినిమాకి అయిన బడ్జెట్‌ రూ.10కోట్లు. థియేట్రికల్‌ బిజినెస్‌ని ఐదు కోట్లుగా లెక్క కట్టారు. ఇప్పటి వరకు కోటి షేర్‌ కూడా రాలేదు. సినిమా బ్రేక్‌ ఈవెన్‌ కావాలంటే రూ.4.30కోట్ల షేర్‌ రావాలి. అంటే ఎనిమిది కోట్లకుపైగానే గ్రాస్‌ రావాలి. అది సాధ్యమా అనేది చూడాలి. ఎంఎస్‌ రాజు దర్శకుడిగా రూపొందించిన ఈ చిత్రంలో కామాక్షి భాస్కర్‌ మెయిన్‌ లీడ్‌గా చేసింది. మహాదేవి పాత్రలో ఒదిగిపోయింది. ఆమెతోపాటు శ్రావణ్‌ రెడ్డి, ఉల్కా గుప్తా, భాను చందర్‌, జోవికా విజయ్‌ కుమార్‌, షిజ్జు వంటి వారు