స్మార్ట్ రేషన్ కార్డులతో సంక్షేమ పథకాలు మరింత పారదర్శకం
Actor ProfilePolitician

స్మార్ట్ రేషన్ కార్డులతో సంక్షేమ పథకాలు మరింత పారదర్శకం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
స్మార్ట్ రేషన్ కార్డులతో సంక్షేమ పథకాలు మరింత పారదర్శకం
Eenadu25 Dec 2026
స్మార్ట్ రేషన్ కార్డులతో సంక్షేమ పథకాలు మరింత పారదర్శకం

భువనగిరి: స్మార్ట్‌ రేషన్‌ కార్డులతో అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు మరింత పారదర్శకంగా, సమర్థంగా అందుతాయని శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. ఆధునిక సాంకేతికతను వినియోగించి రూపొందించిన స్మార్ట్‌ రేషన్‌ కార్డులు కుటుంబానికి గుర్తింపుగా ఉండటంతో పాటు ప్రభుత్వ సేవలను సులభంగా పొందేందుకు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. భువనగిరి జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డితో కలిసి లబ్ధిదారులకు స్మార్ట్‌ రేషన్‌ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ పేద కుటుంబాలకు ప్రభుత్వం అందించే బియ్యం, ఇతర సంక్షేమ పథకాలు సక్రమంగా చేరేందుకు స్మార్ట్‌ కార్డులు దోహదపడతాయని అన్నారు. కుటుంబ సభ్యుల వివరాలు డిజిటల్‌ విధానంలో నమోదై ఉండటంతో డూప్లికేషన్‌కు అవకాశం తగ్గి, లబ్ధిదారుల గుర్తింపు మరింత స్పష్టంగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి, ఎస్పీ అక్షాంశ్‌ యాదవ్‌, అదనపు కలెక్టర్‌ వెంకారెడ్డి, మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ తంగళ్లపల్లి శ్రీవాణి-రవికుమార్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ అవేస్‌ చిస్తి, ఆర్డీవోలు కృష్ణారెడ్డి, శేఖర్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ ఛైర్‌పర్సన్‌ శ్రీరేఖ-బాబూరావు, మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌ పోతంశెట్టి మంజుల-వెంకటేశ్వర్లు, డీసీఎస్‌వో రోజారాణి, వివిధ శాఖల అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు