
హనుమకొండ: పేదల ముఖంలో చిరునవ్వు చూడటమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం హనుమకొండలోని అంబేడ్కర్ భవన్‌లో నిర్వహించిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. అనంతరం ఎంపీ డాక్టర్ కావ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, నాగరాజు, కలెక్టర్ చాహాత్ బాజ్ పాయిలతో కలిసి లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. రేషన్ కార్డు అనేది కేవలం ఒక గుర్తింపు పత్రం కాదని, పేద కుటుంబాలకు ఆహార భద్రతతోపాటు అనేక సంక్షేమ పథకాలకు ఆధారమని పేర్కొన్నారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు