సొమ్ము ఇచ్చినా.. పనులు చేయరేం
Actor ProfilePolitician

సొమ్ము ఇచ్చినా.. పనులు చేయరేం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
సొమ్ము ఇచ్చినా.. పనులు చేయరేం
Eenadu26 Dec 2026
సొమ్ము ఇచ్చినా.. పనులు చేయరేం

చింతలపూడి మండలంలో అయిదు చోట్ల నిర్మాణాలు ఆగిపోయాయి. చింతంపల్లిలో శ్లాబ్‌ పూర్తయిన కట్టడానికి రూ.18.20 లక్షలు, ఎండపల్లికి రూ.13.50 లక్షలు, ఊట సముద్రంలో భవనానికి రూ.17 లక్షలు మంజూరు చేశారు. వీటిలో ఏ ఒక్కచోట పని ముందుకు సాగకపోవడం యంత్రాంగం పని తీరుకు అద్దం పడుతోంది. కొయ్యలగూడెం గ్రామీణ, మండవల్లి, ఉంగుటూరు, చింతలపూడి, న్యూస్‌టుడే: గ్రామాల్లో హెల్త్‌ క్లినిక్‌ల నిర్మాణం పేరుతో ఆర్భాటం చేసిన గత ప్రభుత్వం వాటిని పూర్తి చేయించడంలో విఫలమైంది. నిధుల విడుదల పట్టించుకోకపోవడంతో పనులు ముందుకు సాగలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అసంపూర్తి నిర్మాణాలపై దృష్టి పెట్టింది. వివిధ విభాగాల నుంచి నిధులు కేటాయిస్తూ డిసెంబరులో ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కొన్నిచోట్ల పనులు తుది దశకు చేరుతుండగా పలుచోట్ల ఇంకా మొదలు పెట్టలేదు. నిధులు మంజూరైన పనులన్నింటినీ వచ్చే రెండు నెలల్లో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ రమేశ్‌ తెలిపారు. మొత్తం 128 పనులకు ఎన్‌హెచ్‌ఎం నిధులు రూ.2073 లక్షలు మంజూరయ్యాయి. వీటిలో 116 పనులు ముందుకు సాగుతున్నాయి. పీఎం అభీమ్‌ కార్యక్రమం కింద 3 చోట్ల, 15వ ఆర్థిక సంఘం నిధులతో 16 చోట్ల పనులు చేపట్టారు. ఉంగుటూరులోని క్లినిక్‌ నిర్మాణం తుది దశలో ఆగిపోయింది. అప్పటికే రూ.25.80 లక్షలు ఖర్చు చేశారు. మిగిలిన పనుల కోసం రూ.4.50 లక్షలు మంజూరైనా పూర్తి చేయించడంలో అధికారులు వెనుకబడ్డారు. కొయ్యలగూడెం మండలం చొప్పరామన్నగూడెంలో ఆయుష్మాన్‌ మందిర్‌ నిర్మాణం దాదాపు పూర్తయింది. తలుపులు, కిటికీలు అమర్చడం వంటి పనులు మిగిలాయి. వీటిని పూర్తి చేయడానికి గత డిసెంబరులో ఎన్‌హెచ్‌ఎం నిధులు రూ.12 లక్షలు మంజూరయ్యాయి. అయినా గుత్తేదారు ముందుకు రాని పరిస్థితి. మండవల్లి మండలం పెరికిగూడెంలో హెల్త్‌ క్లినిక్‌ నిర్మాణం శ్లాబ్‌ దశలో ఆగిపోయింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పనులు పూర్తి చేయడానికి రూ.20.30 లక్షలు మంజూరు చేసింది. అయినా ఏడు నెలలుగా