
‘మనం పుట్టేటప్పుడు ఏమీ తీసుకురాం. వెళ్లేటప్పుడు ఏమీ తీసుకుపోం. అందుకు మనదగ్గర ఇప్పుడు ఉన్నది నలుగురికి ఉపయోగపడేలా పంచేద్దాం’ అని గొప్పగా ఆలోచించినట్లున్నారు తమిళనాడుకు చెందిన విశ్రాంత ప్రైవేట్ ఉద్యోగి సుబ్బయ్య(82). ఈయనది మదురైలోని హార్విపట్టి. భార్య కొన్నేళ్ల క్రితం మృతి చెందారు పిల్లలు లేకపోవడంతో ఒంటరిగా జీవిస్తున్నారు. సుబ్బయ్య తన శరీరాన్ని ఇప్పటికే మదురైలోని ప్రభుత్వ రాజాజీ వైద్య కళాశాలకు దానం చేయగా.. ఇప్పుడు తన జీవితకాల పొదుపు రూ.60 లక్షల విలువైన నగదు, బంగారు నగలను సైనిక దళాల ఫ్లాగ్ డే ఫండ్ కోసం విరాళంగా ప్రకటించారు. ఆ మేరకు వీలునామా పత్రాన్ని జిల్లా కలెక్టర్ నిశాంత్ కృష్ణకు తాజాగా అందజేశారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు