
Telugu Cinema•29 Nov 2026
సూఫీ సంగీతం, ప్రేమ సాహిత్యం - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్అనిల్ రావిపూడి తీసిన అనేక చిత్రాలకు సహ రచయితగా పని చేసిన ఎస్. కృష్ణ (S Krishna) దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాకి ‘హై’ (High) అని టైటిల్ ఫిక్స్ అయింది. ఇమేజ్‌స్పార్క్ ఎంటర్‌టైన్‌మెంట్, మైరా క్రియేషన్స్ పై హరీష్ పెద్ది, ఎస్ కృష్ణ, శేఖర్ దివ్వెల సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్ కృష్ణ, పల్లవి దొర జంటగా నటించారు. మరో హీరోయిన్ గా అనన్య శర్మ నటిస్తోంది. తాజాగా ఫస్ట్ సింగిల్ ‘ఫనా’ లిరికల్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. వికాస్ బడిస సంగీతం అందించిన ఈ పాట షహజాద్ అలీ ఆలపించగా రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. ‘ఫనా ’పాటలోని మెలోడీ, సూఫీ ఫీల్, ప్రేమను ప్రతిబింబించే సాహిత్యం కలిసి వినసొంపైన అనుభూతిని అందిస్తున్నాయి