
Eenadu•6 Oct 2026
సాఫ్ట్ వేర్ ఉద్యోగం వదిలి.. 2 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నప్పుడు ఈనాడు దినపత్రికలో ప్రచురితమైన ఒక చిన్న ఫొటో ఆ విద్యార్థి మనసులో బలమైన ముద్ర వేసింది. ప్రత్యేకత ఉంటేనే గుర్తింపు అనే ఆశయంతో వ్యవసాయం చేసే తల్లిదండ్రుల కష్టానికి ప్రతిఫలం దక్కాలని భావించాడు. ఆర్‌డీటీ దాతృత్వంతో ఇంటర్, ఎస్వీయూలో బీటెక్, కాలికట్‌లో ఎన్‌ఐటీలో ఎంటెక్ పూర్తి చేశాడు తలారి పకీరప్ప. రూ.లక్షల జీతం ఇచ్చే సాఫ్ట్‌వేర్ కొలువునూ వదులుకున్నాడు. ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా శ్రమించి.. ప్రస్తుతం రెండు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు (రైల్వే, సీజీఎల్) సాధించాడు. పకీరప్ప స్ఫూర్తిదాయక ప్రయాణం ఆయన మాటల్లోనే.. ఈ వార్త చదివారా: విదేశీయులను రప్పిద్దాం!