
ఒకప్పుడు వెండితెరపై ఓ సంచలనం.. అందం, అభినయంతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసిన తార. ఆమె పేరు చెప్పగానే చాలా మందికి 'రామ్ తేరి గంగా మైలీ' సినిమానే గుర్తుకొస్తుంది. కానీ, తెలుగు ప్రేక్షకులకు మాత్రం ఆమె సూపర్ స్టార్ కృష్ణ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ చిత్రం ‘సింహాసనం’ కథానాయిక. ఆ చిత్రంలో 'విషకన్య' పాత్రలో కృష్ణ పక్కన ఆమె అభినయం ఇప్పటికీ చాలా మందికి గుర్తుండే ఉంటుంది. ఆ తారే మందాకిని. మరి ఇన్నేళ్ల తర్వాత ఆమె ఇప్పుడెక్కడున్నారు? ఏం చేస్తున్నారు? అనే ఆసక్తి చాలా మందిలో ఉంటుంది. తాజాగా ఆమె సోషల్ మీడియాలో పంచుకున్న కొన్ని ఫోటోలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.ప్రస్తుతం మందాకిని మనాలి పర్యటనలో ఉన్నారు. అక్కడి ప్రశాంతమైన వాతావరణాన్ని, పర్వతాల అందాలను ఆస్వాదిస్తున్నారు. ఈ సందర్భంగా హిమాచల్ ప్రదేశ్ సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా, అక్కడి సంప్రదాయ దుస్తులు ధరించి దిగిన ఫోటోలను ఆమె పంచుకున్నారు. వీపుపై పూలతో అలంకరించిన సంప్రదాయ బుట్ట (టోక్రీ)తో, పర్వతాల నడుమ ప్రశాంత వదనంతో ఆమె కనిపించారు. ఈ ఫోటోలు చూస్తుంటే కాలం గడిచినా ఆమెలోని ఆకర్షణ ఏమాత్రం తగ్గలేదనిపిస్తుంది.ఈ ఫోటోలతో పాటు ప్రకృతి ఒడిలో లభించే ఆనందం గురించి ఆమె ఒక భావోద్వేగభరితమైన నోట్ రాశారు. "కొండలకు మాత్రమే తెలిసిన ఒక ప్రత్యేకమైన ఆనందం ఉంటుంది. పైన్ చెట్ల గుసగుసలు, చల్లని గాలి స్పర్శ, ప్రకృతిలోని శాశ్వతమైన అందం ఆ ప్రశాంతతను మోసుకొస్తాయి. మనాలిలో ప్రతి సూర్యోదయం ఒక ఆశీర్వాదంలా, ప్రతి దారి ఒక కథలా అనిపిస్తుంది. కొన్ని