సుపరిపాలనతో స్వర్ణాంధ్ర సాధన
Actor ProfilePolitician

సుపరిపాలనతో స్వర్ణాంధ్ర సాధన

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
సుపరిపాలనతో స్వర్ణాంధ్ర సాధన
Eenadu27 Dec 2026
సుపరిపాలనతో స్వర్ణాంధ్ర సాధన

జెండా వందనం చేస్తున్న మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ, కలెక్టర్‌ వినోద్‌కుమార్, ఎస్పీ ఉమామహేశ్వర్, బావుడా ఛైర్మన్‌ రాజశేఖరబాబు, జేసీ భావన బాపట్ల, న్యూస్‌టుడే: వికసిత్‌ భారత్, స్వర్ణాంధ్రప్రదేశ్‌ లక్ష్యాల సాధన ధ్యేయంగా సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందిస్తోందని రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ అన్నారు. బాపట్లలోని పోలీసు కవాతు మైదానంలో శనివారం నిర్వహించిన 80వ స్వాతంత్య్ర వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఎగురవేశారు. జెండాకు వందనం చేసి, స్వాతంత్య్ర సమరయోధులకు నివాళి అర్పించారు. అనంతరం మంత్రిని కలెక్టర్‌ వినోద్‌కుమార్, ఎస్పీ ఉమామహేశ్వర్‌లు ప్రత్యేక వాహనంలో మైదానంలోకి తోడ్కొని వెళ్లారు. పోలీసు సిబ్బంది నుంచి మంత్రి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం రవికుమార్‌ మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం సమప్రాధాన్యం ఇస్తోందన్నారు. పోలీసు సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరిస్తున్న మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ జిల్లాలో రూ.761.41 కోట్లతో నాలుగు భారీ పరిశ్రమలు ఏర్పాటుచేసి 5,493 మందికి ఉపాధి కల్పించామన్నారు. బాపట్ల, న్యూస్‌టుడే: స్వాతంత్య్ర వేడుకల్లో పోలీసు బలగాల కవాతు, జాగిలాల ప్రదర్శన ఆకట్టుకున్నాయి. పోలీసు శాఖ స్టాల్‌కు ప్రత్యేక బహుమతి లభించింది. స్టాల్‌లో ప్రదర్శనగా ఉంచిన ఆధునిక కమ్యూనికేషన్ల వ్యవస్థ, మహిళల భద్రతకు చేపడుతున్న చర్యలు, విపత్తుల్లో ప్రజల ప్రాణాల రక్షణ, రహదారి భద్రత, శక్తి బృందాల పనితీరు, గంజాయి నిర్మూలన, రహదారి ప్రమాదాల నివారణకు శిరోరక్ష- ప్రాణరక్ష కార్యక్రమం ద్వారా ద్విచక్ర వాహనదారులు శిరస్త్రాణం ధరించడం తప్పనిసరి చేయడం, నేరాల ముందస్తు నివారణ, తీర ప్రాంతంలో పర్యాటకుల భద్రతకు డ్రోన్‌ కెమెరాలు, సీసీ కెమెరాల వినియోగం తదితర అంశాలను మంత్రి గొట్టిపాటి రవికుమార్‌కు ఎస్పీ ఉమామహేశ్వర్‌ వివరించారు. ఎమ్మెల్యేలు వేగేశన నరేంద్రవర్మ, ఎం.ఎం.కొండయ్య, కలెక్టర్‌ వినోద్‌కుమార్, జేసీ భావన, బావుడా ఛైర్మన్‌ సలగల రాజశేఖరబాబు, అదనపు ఎస్పీ సుధాకర్, కవాతు కమాండర్, ఏఆర్‌ డీఎస్పీ కృష్ణంరాజు తదితరులు