
Eenadu•2 Jan 2027
సంప్రదాయ కోర్సులకు భిన్నంగా కొత్త కోర్సులుఅప్రెంటిస్షిప్తో కూడిన డిగ్రీ కోర్సులను ఉన్నత విద్యామండలి తీసుకొచ్చింది. సంప్రదాయ కోర్సులకు భిన్నంగా వీటిని రూపొందించింది. కేంద్ర ప్రభుత్వ సెక్టార్ స్కిల్ కౌన్సిళ్ల సహకారంతో వీటిని తీసుకొచ్చింది. ఈ ఏడాది నుంచి అమల్లోకి తీసుకురావాలని భావిస్తోంది. గతంలో డిగ్రీ కళాశాలల అనుమతుల పొడిగింపు, కొత్త కోర్సులకు అనుమతులు ఇచ్చే అధికారం ఉన్నత విద్యామండలికి ఉండేది. ఇటీవల ఈ అధికారాలను తొలగించి, కొత్తగా ఏర్పాటు చేసిన కమిషనరేట్‌కు ఉన్నత విద్యాశాఖ అప్పగించింది. వివరాలకు.. సంప్రదాయ కోర్సులకు భిన్నంగా కొత్త కోర్సులు