స్పిరిట్’కు దీపికను వద్దనుకోవడానికి అసలు కారణమిదే
Actor ProfileActor

స్పిరిట్’కు దీపికను వద్దనుకోవడానికి అసలు కారణమిదే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
స్పిరిట్’కు దీపికను వద్దనుకోవడానికి అసలు కారణమిదే
Chitrajyothy25 Jan 2027
స్పిరిట్’కు దీపికను వద్దనుకోవడానికి అసలు కారణమిదే

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘స్పిరిట్’. ఈ మూవీ నుంచి దీపికను తీసేయడానికి గల అసలు కారణం నిర్మాత రివీల్ చేశారు. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas) హీరోగా, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘స్పిరిట్’ (Spirit). ఈ భారీ ప్రాజెక్ట్‌లో ప్రభాస్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె నటించనుందంటూ గతంలో ప్రచారం సాగడం, ఆ తర్వాత ఆమె ఈ సినిమా నుంచి తప్పుకుందంటూ వార్తలు రావడం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ సినిమా విషయంలో దీపికా పదుకొణె (Deepika Padukone) చేసిన కామెంట్స్ ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ కాస్టింగ్ వివాదంపై సందీప్ రెడ్డి వంగా సోదరుడు, చిత్ర సహ నిర్మాత ప్రణయ్ రెడ్డి (Pranay Reddy Vanga) వంగా తాజాగా స్పందించి అసలు నిజాన్ని బయటపెట్టారు. దీపికాతో దాదాపు ఏడాదిన్నర పాటు చర్చలు జరిపినప్పటికీ ప్రాజెక్ట్ ఎందుకు వర్కవుట్ కాలేదో స్పష్టంగా వివరించారు. ప్రణయ్ రెడ్డి వంగా మాట్లాడుతూ.. ‘‘సందీప్ దాదాపు ఏడాదిన్నర పాటు దీపికా పదుకొణెతో ‘స్పిరిట్’ కథ, ఆమె పాత్రకు సంబంధించి చర్చలు జరిపారు. ఆమెకు కథ విపరీతంగా నచ్చినప్పటికీ కొన్ని కఠినమైన వ్యాపార నిబంధనలు, షరతుల వల్లే ఆమెను ఈ ప్రాజెక్ట్‌లోకి తీసుకోలేకపోయాం. భారీ రెమ్యూనరేషన్ పెంపుతో పాటు సినిమా లాభాల్లో ఏకంగా 10 శాతం వాటా కావాలని ఆమె డిమాండ్ చేశారు. అంతేకాకుండా రోజువారీ షూటింగ్ పనివేళలకు సంబంధించి కూడా ఆమె పెట్టిన నిబంధనలు సినిమా మేకింగ్‌కు అనుకూలంగా అనిపించలేదు’’ అని తెలిపారు. భారీ బడ్జెట్‌తో అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో తెరకెక్కుతోన్న ఈ సినిమా నిర్మాణానికి ఈ రకమైన షరతులు సమంజసంగా అనిపించకపోవడంతోనే పరస్పర అంగీకారంతో ఆమె