సెప్టెంబర్ 4 నుంచి 'జగమే సంగీతం
Actor ProfileActor

సెప్టెంబర్ 4 నుంచి 'జగమే సంగీతం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
సెప్టెంబర్ 4 నుంచి 'జగమే సంగీతం
Chitrajyothy21 Jan 2027
సెప్టెంబర్ 4 నుంచి 'జగమే సంగీతం

ఈ యేడాది 'మన శంకర వరప్రసాద్‌ గారు' సినిమాతో నిర్మాతగా చక్కని విజయాన్ని అందుకున్న సుస్మిత కొణిదెల తాజాగా అమెజాన్ ప్రైమ్ కోసం 'జగమే సంగీతం' వెబ్ సీరిస్ నిర్మించారు. మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత కొణిదెల నిర్మాతగా మరో వెబ్ సీరిస్ రాబోతోంది. గతంలో ఆమె 'షూట్‌ అవుట్ ఎట్ ఆలేర్' వెబ్ సీరిస్ తోనే నిర్మాతగా తన కెరీర్ ను ప్రారంభించారు. ఆ తర్వాత 'సేనాపతి' పేరుతో ఓ వెబ్ ఫిల్మ్ తీశారు. ఆపైన 'శ్రీదేవి శోభన్ బాబు' సినిమాను నిర్మించారు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, తన తండ్రి చిరంజీవి కథానాయకుడిగా ఈ యేడాది ఆమె నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించిన 'మన శంకర వర ప్రసాద్‌' అఖండ విజయాన్ని అందుకుంది. ఆ స్ఫూర్తితో ఇప్పుడు అమెజాన్ కోసం 'జగమే సంగీతం' వెబ్ సీరిస్ నిర్మించారు. ప్రకాశ్‌ రాజ్‌, మధుబాల, శ్రీకాంత్‌ ప్రధాన పాత్రలు పోషించిన మ్యూజికల్ డ్రామా 'జగమే సంగీతం' సెప్టెంబర్ 4 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్‌ కాబోతోంది. ప్రైమ్ వీడియో ఒరిజినల్ హిందీ సీరిస్ 'బందిష్‌ బాండిట్స్' స్ఫూర్తితో తెలుగులో పల్నాటి సూర్యప్రతాప్‌ దర్శకత్వంలో దీనిని చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల నిర్మించారు. వంగాల సూర్య మనోజ్, శ్రావణి సముద్రాల, ఎ.ఆర్. ప్రభావ్ రచించిన ఈ మ్యూజికల్ డ్రామాకు విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు. ఆయన సంగీతం ఈ సిరీస్‌కు బ్యాక్ బోన్‌గా నిలుస్తుందని మేకర్స్ చెబుతున్నారు. ఈ సీరిస్ గురించి దర్శకుడు సూర్యప్రతాప్ చెబుతూ, 'కర్ణాటక సంగీతపు గొప్ప ప్రపంచ నేపథ్యంలో సాగే కథతో 'జగమే సంగీతం' రాబోతోంది. తన తాత శాస్త్రి గారి ప్రఖ్యాత సంగీత వారసత్వానికి వారసుడైన బాలు, సంప్రదాయ భారం, విచ్ఛిన్నమైన కుటుంబ బంధాలు, చిరకాలంగా దాచిపెట్టిన రహస్యాలతో సతమతమవడాన్ని చూపిస్తుంది. పాత వైరుధ్యాలు మళ్లీ తలెత్తి, తరతరాల వారసత్వాన్ని నాశనం చేసే ప్రమాదం ఏర్పడినప్పుడు, బాలు