సోనియాగాంధీ 'వందేమాతరం' ఆలాపన వివాదం.. అడ్డుకున్నారని మండిపడ్డ బీజేపీ.. కాంగ్రెస్ ఏం చెప్పింది
Actor ProfilePolitician

సోనియాగాంధీ 'వందేమాతరం' ఆలాపన వివాదం.. అడ్డుకున్నారని మండిపడ్డ బీజేపీ.. కాంగ్రెస్ ఏం చెప్పింది

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
సోనియాగాంధీ 'వందేమాతరం' ఆలాపన వివాదం.. అడ్డుకున్నారని మండిపడ్డ బీజేపీ.. కాంగ్రెస్ ఏం చెప్పింది
Samayam Telugu26 Dec 2026
సోనియాగాంధీ 'వందేమాతరం' ఆలాపన వివాదం.. అడ్డుకున్నారని మండిపడ్డ బీజేపీ.. కాంగ్రెస్ ఏం చెప్పింది

దేశ 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని కాంగ్రెస్‌ పార్టీ హెడ్ క్వార్టర్స్‌లో నిర్వహించిన జెండా వందనం కార్యక్రమం దేశంలో రాజకీయంగా తీవ్ర వివాదానికి దారితీసింది. వందేమాతరం పూర్తి గేయాన్ని ఆలపించే సమయంలో కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ అభ్యంతరం వ్యక్తం చేశారంటూ బీజేపీ చేసిన ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోను బీజేపీ నేతలు సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ కాంగ్రెస్‌ తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు.వందేమాతరం కేవలం గేయం కాదని.. స్వాతంత్య్ర పోరాటం, జాతీయ చైతన్యం, దేశభక్తికి ప్రతీక అని బీజేపీ అధికార ప్రతినిధి గోపాల్‌ కృష్ణ అగర్వాల్‌ అన్నారు. వందేమాతరం గేయాలాపన సమయంలో సోనియా గాంధీ అసంతృప్తి వ్యక్తం చేసి.. దాన్ని ఆపాలని సూచించినట్లు వీడియోలో కనిపిస్తోందని బీజేపీ నేతలు ఆరోపించారు. దీనిపై కాంగ్రెస్‌ పార్టీ వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.అయితే.. సోనియాగాంధీ వందేమాతరం వివాదంపై బీజేపీ చేస్తున్న ఆరోపణలను కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా ఖండించింది. వందేమాతరం గేయాన్ని సోనియా గాంధీ ఆపే ప్రయత్నం ఎక్కడా జరగలేదని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ స్పష్టం చేశారు. ఆ కార్యక్రమంలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చాలాసేపు నిల్చొని ఉండటంతో.. ఆయనకు కుర్చీ ఏర్పాటు చేయాలని సోనియా గాంధీ అక్కడి సిబ్బందికి సూచించారని వివరించారు. అంతేకాకుండా కార్యక్రమంలో వందేమాతరాన్ని పూర్తి రూపంలోనే ఆలపించారని తెలిపారు.ఇక.. వైరల్‌ అవుతున్న ఆ వీడియోలో వందేమాతరం ఆలాపన కొనసాగుతున్న సమయంలో సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే పరస్పరం మాట్లాడుకోవడం.. ఆ తర్వాత కొందరికి సైగలు చేయడం కనిపిస్తోంది. ఇదే దృశ్యాన్ని బీజేపీ తన ఆరోపణలకు ఆధారంగా చూపుతోంది. అయితే వీడియోలో కనిపిస్తున్న సంకేతాల ఉద్దేశం ఏమిటన్నదానిపై ఇరు పార్టీల వాదనలు పూర్తిగా భిన్నంగా ఉండటంతో అసలు చిక్కుముడి వచ్చి పడింది. ఈ వివాదంతో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల వేదికగా మరోసారి బీజేపీ-కాంగ్రెస్‌ మధ్య రాజకీయ మాటల యుద్ధం మొదలైంది. జాతీయ