సినిమా రంగంలో అతి పెద్ద వయసు 'జెన్ జీ' నేనే
Actor ProfileActor

సినిమా రంగంలో అతి పెద్ద వయసు 'జెన్ జీ' నేనే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
సినిమా రంగంలో అతి పెద్ద వయసు 'జెన్ జీ' నేనే
AP7AM17 Dec 2026
సినిమా రంగంలో అతి పెద్ద వయసు 'జెన్ జీ' నేనే

విలక్షణ నటుడు కమల్ హాసన్ సినీ రంగ ప్రవేశం చేసి 67 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సుదీర్ఘ ప్రయాణంపై ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఆసక్తికరమైన విశ్లేషణ చేశారు. దశాబ్దాల అనుభవం ఉన్నప్పటికీ, మారుతున్న చిత్ర పరిశ్రమకు అనుగుణంగా నిరంతరం నేర్చుకుంటూనే ఉంటానని చెబుతూ.. తనను తాను సినిమా రంగంలోని "అత్యంత పెద్ద వయసు జెన్ Z" (Oldest of Gen Z) గా అభివర్ణించుకున్నారు.ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా కమల్ హాసన్ తన అభిప్రాయాలను పంచుకున్నారు. "నా 67 ఏళ్ల సినీ ప్రస్థానానికి శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఈ 67 ఏళ్లలో నేను నిజంగా నేర్చుకున్నది కేవలం 20 సంవత్సరాలే అని భావిస్తున్నాను. మిగిలిన సమయం మురుగునీటి ప్రవాహంలో కొట్టుకుపోవడమే. కళాకారులు, ప్రేక్షకులు అందరం కలిసికట్టుగా సినిమా అనే సముద్రంలో కలిసేందుకు ప్రవహిస్తున్నాం. అదొక గొప్ప ఆశ" అని తనదైన తాత్విక ధోరణిలో పేర్కొన్నారు.అంతేకాదు, సినిమా చరిత్రను కూడా ఆయన గుర్తుచేశారు. "1895 డిసెంబర్‌లో లూమియర్ బ్రదర్స్ తొలిసారిగా చిత్రాన్ని ప్రదర్శించారు. అప్పటి నుంచి సినిమా పరిశ్రమకు సుమారు 130 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ మొత్తం సినీ చరిత్రలో సగానికి పైగా, అంటే 67 ఏళ్లుగా నేను ఈ రంగంలోనే ఉన్నానని నా బృందం గుర్తు చేసింది. ఇది నమ్మశక్యం కాని ఆలోచన. అయినా నేను నేర్చుకున్నది 20 ఏళ్లే" అని ఆయన తన పోస్టులో వివరించారు.కమల్ హాసన్ కేవలం ఆరేళ్ల వయసులో "కళత్తూర్ కన్నమ్మ" చిత్రంతో బాలనటుడిగా వెండితెర