
ఇళ్లలో దొంగతనం చేస్తే బాధపడతారని, షాపింగ్ మాల్స్ టార్గెట్ నిందితుడిపై 3 రాష్ట్రాల్లో 32 కేసులు చోరీలకు ఉపయోగించిన పరికరాలు.. నిందితుడు ఆనంద్ (ఇన్‌సర్ట్‌లో) అనంతపురం నేరవార్తలు, న్యూస్‌టుడే: సినిమాలంటే ఇష్టంతో ఎప్పటికైనా తానే ఓ చిత్రం నిర్మించాలని భావించాడు. ఓడలకు వెల్డింగ్ పనులు చేసే అతనికి వచ్చే డబ్బుతో ఇల్లు గడవడమే కష్టం. దీంతో దొంగతనాలు చేయడానికి సిద్ధపడ్డాడు. ఇళ్లల్లోని నగదు, బంగారం చోరీ చేస్తే పేదలు, మధ్యతరగతివారు ఇబ్బందులు పడతారని, కేవలం షాపింగ్ మాల్స్‌ను టార్గెట్‌గా చేసుకున్నాడు. పైగా వాటిని సంపన్నులే నిర్వహిస్తారని, వ్యాపారానికి బీమా కూడా ఉంటుందని అనుకున్నాడు. అలా దోపిడీలు చేసి కూడగట్టిన సొమ్ముతోపాటు తన తల్లి పేరు మీద ఉన్న ఇంటిని విక్రయించాడు. చివరికి రూ.2.5 కోట్లు ఖర్చు చేసి తానే హీరో, దర్శకుడిగా ‘రిటర్న్ బై ఆనంద్.. పేజీ నంబరు 13’ అనే హారర్ సినిమా తీశాడు. రిలీజ్ ఆగిపోవడం, అప్పులు అధికం కావడంతో మళ్లీ చోరీలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కాడు. అనంతపురం నగరంలోని డ్రెస్ సర్కిల్ మాల్‌లో గత నెల 27న చోరీ జరిగింది. మాల్ పైఅంతస్తు నుంచి లోపలికి వెళ్లిన నిందితుడు నగదు అపహరించి ఉడాయించాడు. ఈ కేసును ఎస్పీ జగదీశ్ రెండు బృందాలతో దర్యాప్తు చేయించారు. సీసీటీవీలో నమోదైన కార్ల వివరాలను సేకరించారు. నకిలీ నంబర్ ప్లేట్‌తో వెళ్లిన కారు డ్రైవర్ చిత్రాన్ని ఆర్టీజీఎస్‌లో భాగమైన ‘సీసీటీవీ 360’ సాఫ్ట్‌వేర్‌లో పోల్చి చూడగా పాత నేరస్థుడని తేలింది. ఆ వివరాలు తెప్పించుకొని చూడగా బెంగళూరులోని ఎంఆర్‌ఎస్ పాళ్యానికి చెందిన ఆనంద్‌గా గుర్తించారు. శుక్రవారం ఉదయం బెంగళూరు-అనంతపురం రోడ్డు ఎస్‌జేఆర్ ఫంక్షన్ హాల్ సమీపంలో నిందితుడిని అరెస్ట్ చేశారు. చిక్‌మంగళూరు రేవులో వెల్డింగ్ పనులు చేసే ఆనంద్‌కు నలుగురు పిల్లలు ఉన్నారు. మాల్స్‌లోని సీసీటీవీల్లో కనిపించకుండా ఉండేందుకు మాస్క్‌లు ధరించేవాడు. పోలీసులకు చిక్కొద్దని లాడ్జిల్లో బస చేయకుండా కారులోనే ఉండేవాడు. ఇలా ఆంధ్రప్రదేశ్