సింధూ జలాలను తీసుకొస్తాం.. పాకిస్థాన్ ఆర్మీ శపథం.. దేనికైనా సిద్ధమని ప్రకటన
Actor ProfilePolitician

సింధూ జలాలను తీసుకొస్తాం.. పాకిస్థాన్ ఆర్మీ శపథం.. దేనికైనా సిద్ధమని ప్రకటన

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
సింధూ జలాలను తీసుకొస్తాం.. పాకిస్థాన్ ఆర్మీ శపథం.. దేనికైనా సిద్ధమని ప్రకటన
Oneindia Telugu2 Oct 2026
సింధూ జలాలను తీసుకొస్తాం.. పాకిస్థాన్ ఆర్మీ శపథం.. దేనికైనా సిద్ధమని ప్రకటన

భారత్- పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. గతేడాది ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టిన విషయం తెలిసిందే. పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతాల్లోని కీలక ఉగ్ర స్థావరాలపై దాడులు జరిపి వాటిని పూర్తిగా ధ్వంసం చేసింది. అలాగే పాకిస్థాన్ కు అత్యంత కీలకమైన సింధూ నదీ జలాల పంపిణీ ఒప్పందాన్ని నిలిపివేసింది.సింధూ జలాల ఒప్పందం (ఐడబ్ల్యూటీ) ప్రకారం తమ దేశానికి దక్కాల్సిన చట్టబద్ధమైన నీటి వాటాను కాపాడుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని పాకిస్థాన్ ఆర్మీ వెల్లడించింది. రావల్పిండిలోని సైనిక ప్రధాన కార్యాలయంలో పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ అధ్యక్షతన జరిగిన 276వ కార్ప్స్ కమాండర్ల సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఆదేశాలు, తమ దేశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నీటి హక్కుల సాధనకు కట్టుబడి ఉన్నామని సైన్యం స్పష్టం చేసింది.గతేడాది ఏప్రిల్ 22న పహల్గామ్‌ ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్ అనేక కఠిన చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగానే సింధూ జలాల పంపిణీ ఒప్పందాన్ని భారత్ తాత్కాలికంగా పక్కన పెట్టడంతో ఇరు దేశాల మధ్య జల వివాదం మళ్లీ ముదిరింది. భారత్ తీసుకున్న ఈ ఆంక్షల నేపథ్యంలో పాక్ సైన్యం ఈ కీలక సమావేశాన్ని నిర్వహించడం అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.నీటి మళ్లింపును యుద్ధ చర్యగా ప్రకటనసమావేశంలో ఏప్రిల్ 24, 2025న జరిగిన నేషనల్ సెక్యూరిటీ కమిటీ (ఎన్‌ఎస్‌సీ) సరిహద్దు నిర్దేశాలను ఆర్మీ కమాండర్లు పునరుద్ఘాటించారు. సింధు నది నీటిని ఆపడం లేదా మళ్లించడం వంటి ఏ చర్యలనైనా తమపై యుద్ధ ప్రకటనతో (యాక్ట్ ఆఫ్ వార్) సమానమని పాక్ జాతీయ భద్రతా కమిటీ భావిస్తోంది. ఈ మేరకు తీసుకున్న నిర్ణయాలను విధిగా అమలు చేయాలని, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సైనిక బలగాలకు పిలుపునిచ్చారు.ఈ భేటీలో కేవలం జల వివాదాలపైనే