
KTR Comments On Revanth Reddy : రాబోయే ఎన్నికల్లో అసెంబ్లీ స్థానాలు 182కు పెరుగుతాయి.. 117 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు విజయం సాధిస్తారని.. రెండోసారి అధికారంలోకి రావడం పక్కా.. ఇది భద్రాచలం రాముడి మీద ఆన అంటూ సీఎం రేవంత్ రెడ్డి మధిర నియోజకవర్గం చింతకాని మండలంలో జరిగిన రైతు ఆశీర్వాద సభలో పేర్కొన్నారు. సీఎం రేవంత్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. రేవంత్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నేను ఈ మాట అనొద్దు కానీ తప్పడం లేదు.. రేవంత్ రెడ్డి అనే దరిద్రుడు తెలంగాణకు అన్యాయం చేస్తుండు.. అధికారులు, ఇంజనీర్లు చెబుతున్న మాటలను కూడా పట్టించుకోని రేవంత్ రెడ్డిని బుర్ర తక్కువోడు అనాలా, దరిద్రుడు అనాలా, సన్నాసి అనాల. ఇదికాలం తెచ్చిన కరువు కాదు.. కేసీఆర్ మీద కోపంతో, కక్షతో కాంగ్రెస్ తెచ్చిన కరువు అని కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డి చేసుకున్న సొంత సర్వేలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ 78కి పై సీట్లతో అధికారంలోకి వస్తుందని సర్వే రిపోర్ట్ ఇచ్చింది. రేవంత్ సర్వేతో పాటు ఇంకా నాలుగు సర్వేలు చేశారు.. అవన్నీ కూడా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది అని చెప్పాయి. కాంగ్రెస్ కు వచ్చే ఎన్నికల్లో 117 సీట్లు వస్తాయట.. 117 కాదు ఏడు సీట్లు కూడా రావు.. ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ కు ఘోర పరాభవం తప్పదు అంటూ కేటీఆర్ జోస్యం చెప్పారు. రాష్ట్రంలోని 77 శాతం రిజర్వాయర్లు ఖాళీగా ఉన్నప్పటికీ గోదావరి వరద జలాలను వినియోగించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కేటీఆర్ ఆరోపించారు. గోదావరిలో రోజుకు సుమారు 9 టీఎంసీల నీరు వృథాగా సముద్రంలో కలుస్తోందని, కన్నేపల్లి పంప్‌హౌస్‌ల వద్ద మోటార్లు ప్రారంభిస్తే రోజుకు 2 టీఎంసీల వరకు నీటిని ఎత్తిపోసుకునే అవకాశం ఉందని తెలిపారు. మేడిగడ్డ బ్యారేజీని