
అమరావతి: ‘స్త్రీ శక్తికి ఏడాది - రెట్టింపైన ఆత్మగౌరవం’ వేడుకలో ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) స్వయంగా పాల్గొన్నారు. రాయపూడిలోని పరేడ్ గ్రౌండ్స్ నుంచి సీడ్ యాక్సిస్ రోడ్ మీదుగా మహిళలతో కలిసి ఉచిత బస్సులో సీఎం ప్రయాణించారు. ఈ ప్రయాణంలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన మహిళలతో ముఖాముఖి నిర్వహించి, పథకం ద్వారా పొదుపవుతున్న నగదు, కుటుంబాలకు చేకూరుతున్న లబ్ధి గురించి అడిగి తెలుసుకున్నారు. మత్స్యకార, చేనేత మహిళలు, విద్యార్థినులు ఈ పథకం తమ ఆర్థికవృద్ధికి, వ్యాపారాభివృద్ధికి ఎంతో తోడ్పడుతోందని ఆనందం వ్యక్తం చేశారు. మహిళలు స్వశక్తితో ఎదగాలని, ఆరోగ్యకరమైన అలవాట్లతో ఆదాయాన్ని పొదుపు చేసుకోవాలని సీఎం సూచించారు. ఉచిత ప్రయాణ సదుపాయంతో రోడ్డు ప్రమాదాలు కూడా గణనీయంగా తగ్గాయని, రోజుకు సగటున 24 లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారని వెల్లడించారు. రాష్ట్రంలోని 76 శాతం ఏపీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో ఈ పథకం అమలవుతుండగా, ప్రారంభం నుంచి ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 87 కోట్ల ఉచిత ప్రయాణాలు నమోదయ్యాయి. ప్రయాణం అనంతరం మహిళలతో కలిసి సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి హైటీ కార్యక్రమంలో పాల్గొన్నారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. ఏపీ వ్యాప్తంగా స్వాతంత్ర్య వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచే ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, వివిధ ప్రాంతాలలో మంత్రులు, అధికారులు, నాయకులు జాతీయ జెండాను ఎగురవేసి సంబరాలు చేసుకుంటున్నారు. జై హింద్ నినాదాలతో వీధులు మారుమోగుతున్నాయి. పలు చోట్ల చిన్నారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి