
ఒకప్పుడు సినిమా సూపర్ హిట్ అయితే.. అందులో మ్యూజిక్ డైరెక్టర్లకు కాస్త పేరు వచ్చేది. కానీ ఇప్పుడు ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు సినిమా సూపర్ హిట్ అయితే.. అందులో మ్యూజిక్ డైరెక్టర్లకు కాస్త పేరు వచ్చేది. కానీ ఇప్పుడు ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. డైరెక్టర్ ఎవరైనా, హీరో ఎవరైనా సరే.. మ్యూజిక్ డైరెక్టర్ పేరు చూసే థియేటర్లకు వెళ్లే ప్రేక్షకులు ఎంతోమంది ఉన్నారు. సినిమా బాగుంటే ఒకే.. ఒకవేళ ప్లాప్ అయినా కూడా బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తోనే ఆ సినిమాను నిలబెట్టే రేంజ్‌కు మన మ్యూజిక్ డైరెక్టర్లు ఎదిగిపోయారు. ముఖ్యంగా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఇద్దరు వ్యక్తుల పేర్లు మారుమోగిపోతున్నాయి. చూడటానికి సన్నగా, బక్కగా ఉండే ఈ ఇద్దరు కుర్రాళ్లు.. తమ మ్యూజిక్‌తో మాత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నారు. వాళ్లే అనిరుధ్ (Anirudh Ravichander), సాయి అభ్యంకర్ (Sai Abhyankkar). సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బక్కోడు అనగానే ప్రతి ఒక్కరికీ ఠక్కున గుర్తొచ్చే పేరు అనిరుధ్ రవిచంద్రన్. ధనుష్ నటించిన 3 మూవీలో కొలవెరి డి సాంగ్‌తో మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ యంగ్ సెన్సేషన్.. అతి తక్కువ కాలంలోనే ఊహించని స్థాయిలో హ్యూజ్ ఫ్యాన్ బేస్‌ను సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు స్టార్ హీరోల సినిమాలు అంటే ముందుగా వినిపించే పేరు అనిరుధ్‌దే. ముఖ్యంగా సూపర్ స్టార్ రజినీకాంత్, దళపతి విజయ్ లాంటి స్టార్స్ సినిమాలంటే.. ప్రేక్షకులకు పూనకాలు వచ్చేంత రేంజ్‌లో మ్యూజిక్ ఇవ్వడం ఇతని స్పెషాలిటీ. ప్రస్తుతం ఇతని షెడ్యూల్‌లో దాదాపు 10 భారీ సినిమాలు రాబోతున్నాయి. అందులో తెలుగు నుంచి నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో రాబోతున్న ది ప్యారడైజ్ ఒకటి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజు కాంబినేషన్‌లో రాబోతున్న భారీ సినిమా.. దీనికి తోడు, జూనియర్ ఎన్టీఆర్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రాబోతున్న క్రేజీ ప్రాజెక్ట్ గాడ్ ఆఫ్ వార్