స్టార్ హీరోయిన్ జీవితంలో ఇన్ని కష్టాలా..!! రెండు సార్లు పెళ్లి.. నరకం చూపించిన ఇద్దరు భర్తలు.. చివరకు
Actor ProfileActor

స్టార్ హీరోయిన్ జీవితంలో ఇన్ని కష్టాలా..!! రెండు సార్లు పెళ్లి.. నరకం చూపించిన ఇద్దరు భర్తలు.. చివరకు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
స్టార్ హీరోయిన్ జీవితంలో ఇన్ని కష్టాలా..!! రెండు సార్లు పెళ్లి.. నరకం చూపించిన ఇద్దరు భర్తలు.. చివరకు
TV9 Telugu25 Jan 2027
స్టార్ హీరోయిన్ జీవితంలో ఇన్ని కష్టాలా..!! రెండు సార్లు పెళ్లి.. నరకం చూపించిన ఇద్దరు భర్తలు.. చివరకు

భారతీయ సినీ చరిత్రలో ఆమె ఓ ధృవతార.. తన అందం, అభినయంతో ఎంతో మంది ప్రేక్షకులను అలరించి అగ్ర కథానాయికగా నిలిచింది. ఆమె మరెవరో కాదు సీనియర్ నటి రాజసులోచన. ఈ తరం ప్రేక్షకులకు ఆమె గురించి తెలియకపోవచ్చు కానీ.. అప్పట్లో ఆమె తిరుగులేని హీరోయిన్. నాట్య, సినీ రంగాలతో పాటు కార్ డ్రైవింగ్, బోట్ రైడింగ్ లలో సైతం ఆమె గుర్తింపు పొందారు. విజయవాడలో పుట్టి, మద్రాసులో పెరిగిన రాజా సులోచన, వ్యక్తిగత జీవితంలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. రెండు వివాహాలు, వృత్తిపరమైన ఆటుపోట్లను అధిగమిస్తూ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో 300కు పైగా చిత్రాలలో నటించి ప్రేక్షకుల హృదయాలలో చెరగని ముద్ర వేశారు రాజసులోచన. శ్రీహరి చనిపోయిన తర్వాత క్లోజ్ ఫ్రెండ్సే సగం ఆస్తులు కాజేశారు.. నన్ను ఎవ్వరూ పట్టించుకోలేదు ఈ అందాల తార అసలు పేరు రాజీవలోచన కాగా, స్కూల్ రిజిస్టర్‌లో పొరపాటున రాజసులోచన అని నమోదు కావడంతో అదే పేరు ఆమెకు స్థిరపడింది. రాజసులోచనకు చిన్నతనం నుంచే నాట్యం అంటే అపారమైన ఆసక్తి ఉండేది. కళాభిమాని అయిన ఆమె మేనమామ స్థాపించిన సుగుణ విలాస సభ నాటక, నృత్య ప్రదర్శనలు ఆమెకు ప్రేరణనిచ్చాయి. ఏడేళ్ల వయసులో సంగీతం నేర్చుకోవడం మొదలుపెట్టినా, ఆమె దృష్టి ఎక్కువగా నృత్యం పైనే ఉండేది. మూడో ఫారంలోనే చదువు మానేసి, 13వ ఏట స్టేజీపై తొలిసారి అరంగేట్రం చేశారు. నృత్యం నేర్పే క్రమంలో ఆమెకు పరమశివం అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి, ప్రేమగా మారింది. తల్లిదండ్రుల అంగీకారం లేకపోయినా, 1951 సెప్టెంబర్ 11న కరుణానిధి సమక్షంలో పరమశివంతో ఆమె వివాహం జరిగింది. 1952లో కె.ఎస్. ప్రకాశరావు తన కన్నతల్లి చిత్రంలో ఆమెకు అవకాశం ఇచ్చారు. కెరీర్ ప్రారంభంలో తెలుగు, తమిళ చిత్రాల్లో వ్యాంప్ పాత్రలు చేసినప్పటికీ, ఎన్టీఆర్ నటించిన సొంతవూరు చిత్రంలో హీరోయిన్ గా నిలదొక్కుకున్నారు. ఆ తర్వాత మాంగల్య బలం