
ఆయన పేరును ఖరారు చేసిన చంద్రబాబు నేతృత్వంలోని కమిటీ స్కిల్ కుంభకోణంలో చంద్రబాబుకు బెయిల్ ఇచ్చిన జస్టిస్ మల్లికార్జునరావు మొదట మధ్యంతర బెయిల్ ఇచ్చి.. ఆ తర్వాత పూర్తిస్థాయి బెయిల్ మంజూరు 2024లో ఒక విశ్రాంత ఏసీజే పేరును ఈ పదవికి సిఫారసు చేసిన హైకోర్టు సీజే ప్రధాన న్యాయమూర్తి సిఫారసును చెత్తబుట్టలో పడేసిన చంద్రబాబు ఎటువంటి ఇబ్బందీ ఎదురుకాకుండా ఏకంగా లోకాయుక్త చట్టానికి సవరణలు తద్వారా లోకాయుక్త ఎంపిక నుంచి హైకోర్టు సీజే తొలగింపు.. తన నేతృత్వంలో సెలక్షన్ కమిటీని ఏర్పాటు చేసుకున్న బాబు గత రెండేళ్లుగా లోకాయుక్త పదవిని భర్తీ చేయకుండా ఎప్పటికప్పుడు వాయిదా ఈ క్రమంలో జస్టిస్ మల్లికార్జునరావు పదవీ విరమణ.. వెంటనే ఇస్తే విమర్శలు వస్తాయని 6 నెలలు వేచి చూసిన బాబు ఎట్టకేలకు కీలక పదవికి జస్టిస్ మల్లికార్జునరావు ఎంపిక సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావును లోకాయుక్తగా ఎంపిక చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. హైకోర్టు న్యాయమూర్తిగా ఇటీవల పదవీ విరమణ చేసిన జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావును లోకాయుక్తగా నియమించాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో జరిగిన సెలక్షన్ కమిటీలో ఆ మేరకు నిర్ణయం తీసుకున్నారు. త్వరలో జస్టిస్ మల్లికార్జునరావు నియామకానికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఐదేళ్ల పాటు ఆయన లోకాయుక్త పదవిలో కొనసాగుతారు. వందల కోట్ల రూపాయల నిధుల గోల్‌మాల్ వ్యవహారం 2014–19 మధ్య చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా, స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం జరిగింది. వందల కోట్ల రూపాయల మేర నిధుల గోల్‌మాల్ జరిగినట్లు ఫిర్యాదు అందడంతో సీఐడీ కేసు నమోదు చేసింది. ప్రాథమిక విచారణ జరిపి స్కిల్ కుంభకోణంపై ప్రాథమిక ఆధారాలు సేకరించింది. 2023 సెప్టెంబర్ 9న చంద్రబాబును అరెస్ట్ చేసింది. విజయవాడ ఏసీబీ