సుకుమార్ తనయ సుకృతి వేణికి అరుదైన ఘనత
Actor ProfileActor

సుకుమార్ తనయ సుకృతి వేణికి అరుదైన ఘనత

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
సుకుమార్ తనయ సుకృతి వేణికి అరుదైన ఘనత
Chitrajyothy14 Dec 2026
సుకుమార్ తనయ సుకృతి వేణికి అరుదైన ఘనత

ఇటీవల జాతీయ అవార్డుల్లో ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయితగా సత్తా చాటారు సుకుమార్ . ఇప్పుడు ఆయన తనయ సుకృతి వేణి బండ్రెడ్డి 9Sukruthi Veni B) కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంటూ తండ్రి బాటలోనే విజయాలను అందుకుంటున్నారు. ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ (Sukumar) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ‘పుష్ప’, ‘పుష్ప 2’ చిత్రాలతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. ఇటీవల జాతీయ అవార్డుల్లో ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయితగా సత్తా చాటారు. ఇప్పుడు ఆయన తనయ సుకృతి వేణి బండ్రెడ్డి 9Sukruthi Veni B) కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంటూ తండ్రి బాటలోనే విజయాలను అందుకుంటున్నారు. అయితే ఆమె ఎంచుకున్న రంగం మాత్రం సినిమా కంటే భిన్నమైనది. నటనతో పాటు సంగీతంలోనూ ప్రతిభను చాటుతున్న సుకృతి తాజాగా మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. 2024 సంవత్సరానికి ‘గాంధీ తాత చెట్టు’ చిత్రానికి గాను జాతీయ ఉత్తమ బాల నటిగా అవార్డు అందుకున్న సుకృతి వేణి.. ఇప్పుడు అమెరికాలోని ప్రతిష్ఠాత్మక బెర్క్‌లీ కాలేజ్‌ ఆఫ్‌ మ్యూజిక్‌ నుంచి ప్రత్యేక గుర్తింపు పొందారు. బెర్క్‌లీలో నిర్వహించనున్న సమ్మర్‌ మ్యూజిక్‌ ప్రోగ్రామ్‌కు ఆమెకు ఎన్‌సెంబల్‌ ఎక్సెలెన్స్‌ అవార్డుతో పాటు పూర్తి స్కాలర్‌షిప్‌ ఆమెకు దక్కింది. బోస్టన్‌లోని బెర్క్‌లీ కాలేజ్‌ ఆఫ్‌ మ్యూజిక్‌ ప్రపంచవ్యాప్తంగా సంగీత రంగంలో ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థగా గుర్తింపు పొందింది. అక్కడ నిర్వహించే సమ్మర్‌ మ్యూజిక్‌ ప్రోగ్రామ్‌లో పాల్గొనేందుకు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది విద్యార్థులు పోటీ పడుతుంటారు. ఈసారి మొత్తం 272 మంది విద్యార్థులు ఆడిషన్‌కు హాజరయ్యారు. వారిలో కేవలం 14 మందిని మాత్రమే పూర్తి స్కాలర్‌షిప్‌కు ఎంపిక చేశారు. ఆ 14 మందిలో సింగర్స్‌ విభాగంలో పూర్తి స్కాలర్‌షిప్‌ అందుకున్న ఏకైక విద్యార్థిగా సుకృతి వేణి నిలవడం విశేషం. సంగీతంలో ఆమెకు ఉన్న ప్రతిభ, గాన నైపుణ్యం, ఎన్‌సెంబుల్‌లో ప్రదర్శించిన ప్రతిభను గుర్తించిన బెర్క్‌లీ కాలేజ్‌ ఆమెకు ఈ ప్రత్యేక