సీఎం విజయ్ పేరెంట్స్ తో త్రిష.. స్వాతంత్ర్య వేడుకల్లో నటి
Actor ProfilePolitician

సీఎం విజయ్ పేరెంట్స్ తో త్రిష.. స్వాతంత్ర్య వేడుకల్లో నటి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
సీఎం విజయ్ పేరెంట్స్ తో త్రిష.. స్వాతంత్ర్య వేడుకల్లో నటి
Eenadu22 Dec 2026
సీఎం విజయ్ పేరెంట్స్ తో త్రిష.. స్వాతంత్ర్య వేడుకల్లో నటి

ఇంటర్నెట్‌ డెస్క్: తమిళనాడు ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వాతంత్ర్య వేడుకల్లో నటి త్రిష పాల్గొన్నారు. సీఎం విజయ్‌ తల్లి దండ్రులతో కలిసి మొదటి లైన్‌లో కూర్చుని వేడుకలను (Independence Day) తిలకించారు. అక్కడికి వచ్చిన అధికారులను నవ్వుతూ పలకరిస్తూ.. వారికి అభివాదం చేశారు. ఇక విజయ్‌ (Vijay) సీఎంగా ప్రమాణస్వీకారంలోనూ త్రిష ప్రధాన ఆకర్షణగా నిలిచిన విషయం తెలిసిందే. త్రిష (Trisha) తమిళనాడు రాజకీయాల్లోకి రావాలంటూ ఇటీవల కొన్ని పోస్టర్లు దర్శనమిచ్చాయి. డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్‌ (Udhayanidhi Stalin) ఆమెను ఉద్దేశిస్తూ చేసిన కామెంట్స్‌ కూడా వివాదాస్పదమయ్యాయి. మరోవైపు త్రిషను ఎప్పుడు ఉప ముఖ్యమంత్రిని చేస్తారని అన్నాడీఎంకే మాజీ మంత్రి ఆర్బీ ఉదయకుమార్‌ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఉదయకుమార్‌ వ్యాఖ్యలను ఖండిస్తూ మదురైవ్యాప్తంగా త్రిష వెల్ఫేర్‌ అసోసియేషన్‌ నిర్వాహకులు, అభిమానులు చైన్నైలో పోస్టర్లు అంటించారు. ఈ నేపథ్యంలో త్రిష స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు