సీఎం రేవంత్ కు సింగరేణి పట్ల చిత్త శుద్దిలేదు.. తెలంగాణ బీజేపీ చీఫ్ రామ చందర్ రావు కీలక
Actor ProfilePolitician

సీఎం రేవంత్ కు సింగరేణి పట్ల చిత్త శుద్దిలేదు.. తెలంగాణ బీజేపీ చీఫ్ రామ చందర్ రావు కీలక

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
సీఎం రేవంత్ కు సింగరేణి పట్ల చిత్త శుద్దిలేదు.. తెలంగాణ బీజేపీ చీఫ్ రామ చందర్ రావు కీలక
Zee Telugu7 Nov 2026
సీఎం రేవంత్ కు సింగరేణి పట్ల చిత్త శుద్దిలేదు.. తెలంగాణ బీజేపీ చీఫ్ రామ చందర్ రావు కీలక

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Bjp singareni bharosa yatra: తెలంగాణ బీజేపీ చీఫ్ రామ చందర్ రావు సింగరేణి భరోసా యాత్ర చేపట్టారు. దీనిలో భాగంగా కొత్త గూడెంలో సింగరేణి కార్మికులు, మేధావులతో సమావేశమయ్యారు. కొత్తగూడెంతో పాటు సింగరేణి విస్తరించిన ప్రాంతాలైన మంచిర్యాల వరకు పనిచేస్తున్న సింగరేణి కార్మికులకు, వారి కుటుంబాలకు, ఈ ప్రాంత ప్రజలందరికీ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ఒక శుభవార్త అందించారని పేర్కొన్నారు. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL)కు తాడిచర్ల-II బొగ్గు బ్లాక్‌ను కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తెలంగాణకు ఎంతో ప్రయోజనకరమైనదన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు అనేక హామీలు ఇచ్చినా వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఎద్దేవా చేశారు. చివరికి సింగరేణి సంస్థను నష్టాల బాట పట్టించిందన్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సింగరేణి సంక్షేమం పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి చూపడం లేదని కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు. నష్టాల్లో ఉన్న ఈ సంస్థను గాడిన పెట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలను పూర్తిగా విస్మరించిందన్నారు. రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించినట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి కనిపిస్తోందన్నారు. ఒకవైపు సింగరేణి కార్మికులు తమ రక్తాన్ని, చెమటను చిందిస్తూ సంస్థ కోసం కష్టపడుతుంటే, మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సింగరేణి ఆర్థిక పరిస్థితిని పట్టించుకోకుండా సంస్థకు సంబంధించిన నిధులను ఫుట్‌బాల్ ఆట కోసం ఖర్చు చేయడం దురదృష్టకరమన్నారు. సింగరేణి అంటే తెలంగాణకు ఒక గొప్ప సంపద, ఒక మాణిక్యంలాంటిదన్నారు. అలాంటి సంస్థ నష్టాల్లో కూరుకుపోవడానికి ప్రధాన కారణం బీఆర్ఎస్, కాంగ్రెస్