షారుఖ్ చాలు కదా... మరి 450 కోట్లు ఎందుకు
Actor ProfileActor

షారుఖ్ చాలు కదా... మరి 450 కోట్లు ఎందుకు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
షారుఖ్ చాలు కదా... మరి 450 కోట్లు ఎందుకు
Telugu Times14 Oct 2026
షారుఖ్ చాలు కదా... మరి 450 కోట్లు ఎందుకు

సూర్య ప్రకాష్ జోశ్యుల ఒకప్పుడు షారుఖ్ ఖాన్ పేరు చాలు... టికెట్లు అమ్ముడయ్యేవి. ఇప్పుడు అదే షారుఖ్ సినిమాను అమ్మడానికి ₹450 కోట్ల స్కేల్ కూడా అవసరమైందా? 'కింగ్' బడ్జెట్ బయటకు వచ్చిన తర్వాత బాలీవుడ్‌లో వినిపిస్తున్న అసలు ప్రశ్న ఇదే. స్టార్‌డమ్ తగ్గిపోయిందని ఎవరూ చెప్పడం లేదు. కానీ స్టార్‌డమ్ ఒక్కటే సరిపోవడం లేదనే సంకేతాలు మాత్రం కనిపిస్తున్నాయి. అందుకే 'కింగ్' కేవలం షారుఖ్ కొత్త సినిమా కాదు... ప్రేక్షకుడి అంచనాలు ఏ స్దాయిలో మారిపోయాయో పరీక్షించే సినిమా కూడా. ఒకప్పుడు ప్రేక్షకుడు థియేటర్‌కు వెళ్లే ముందు ఒకటే ప్రశ్న అడిగేవాడు. "హీరో ఎవరు?" ఇప్పుడు అదే ప్రేక్షకుడు మరో ప్రశ్న అడుగుతున్నాడు. "ఈ సినిమా నేను ఇంట్లో చూడలేనిది ఏమి చూపిస్తోంది?" బహుశా... ఈ ఒక్క ప్రశ్నే 'కింగ్' వెనుక ఉన్న ₹450 కోట్ల ఆలోచనను అర్థం చేసుకోవడానికి సరిపోతుంది. షారుఖ్‌కు కాదు... ప్రేక్షకుడు కోసమే ఈ సినిమా తీస్తున్నారా? షారుఖ్ ఖాన్ మార్కెట్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. 'పఠాన్'... 'జవాన్' లాంటి సినిమాలు ఆయనకు ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా భారీ ఓపెనింగ్స్ తీసుకురాగల స్టార్‌డమ్ ఉందని నిరూపించాయి. అయితే ప్రశ్న స్టార్ గురించి కాదు. ఆ స్టార్‌ను చూడటానికి వచ్చే ప్రేక్షకుడి అంచనాల గురించి. ఇప్పుడు ప్రేక్షకుడు టికెట్ కొనడం లేదు...ఒక ఎక్సపీరియన్స్( అనుభవాన్ని) కొనుగోలు చేస్తున్నాడు. ఇది బడ్జెట్ కాదు... ఒక బిజినెస్ మోడల్ ట్రేడ్ సర్కిల్స్‌లో తరచూ వినిపించే ఒక మాట ఉంది. "ఈ రోజుల్లో పెద్ద స్టార్ సినిమా, మొదటి రోజు కలెక్షన్లతో కాదు... ప్రపంచవ్యాప్తంగా ఎంతకాలం ఈవెంట్‌గా నిలుస్తుందనే దానితో గెలుస్తుంది." అందుకే భారీ బడ్జెట్‌లో ఎక్కువ భాగం కథను మార్చడానికి కాదు... కథను ప్రపంచ స్థాయిలో చూపించడానికి వెళ్తోంది. భారీ యాక్షన్. ప్రీమియం విజువల్స్. అంతర్జాతీయ లొకేషన్లు. IMAX ప్రెజెంటేషన్. ప్రపంచ మార్కెట్‌కు సరిపోయే ప్రొడక్షన్ విలువలు. ఇవన్నీ ఇప్పుడు ఖర్చు